
తిరుపతి: కుల, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తున్న నేత సీఎం వైఎస్ జగన్ అని మంత్రి రోజా కొనియాడారు. జగనన్న సంక్షేమ సామ్రాట్ అని రోజా ప్రశంసించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక వేడుకలకు హాజరైన రోజా.. మాట్లాడారు.
వచ్చే నెలలో జగనన్న పుట్టినరోజుని పురస్కరించుకుని స్వర్ణోత్సవ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు రోజా తెలిపారు. ఈ రోజు నుంచి పోటీలు నిర్వహిస్తున్నట్లు రోజా తెలిపారు. రాయలసీమలో జోన్‌ల వారీగా 19, 20,21వ తేదీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా కళాకారుల డేటా సేకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రోజాతో పాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment