హైదరాబాద్: ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎలా కోరతారంటూ మండిపడింది ఉన్నత న్యాయస్థానం.
కేసు దర్యాప్తుతో సంబంధం లేని వ్యక్తులు ఇప్పుడెలా పిటిషన్ వేస్తారు? ముఖ్యమంత్రి జగన్ సాక్షులను ఏమైనా ప్రభావితం చేశారా? అసలు పిటిషన్‌కు ఏ రకంగా విచారణకు అర్హత ఉందంటూ సోమవారం విచారణ సందర్భంగా పిటిషనర్ రఘురామ కృష్ణరాజును హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు సీఎం జగన్‌కు నోటీసులివ్వాలన్న అభ్యర్థనను సైతం కోర్టు తిరస్కరించింది. తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది తెలంగాణ హైకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment