సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. రఘురామ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.
కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment