అచ్చెన్న బెయిల్‌పై విచారణ వాయిదా | High Court Postponed Atchannaidu Bail Petition Hearing | Sakshi
Sakshi News home page

అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

Published Thu, Jul 16 2020 6:23 PM | Last Updated on Thu, Jul 16 2020 7:34 PM

High Court Postponed Atchannaidu Bail Petition Hearing - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారం వాయిదా వేసింది. ఈ కేసు దర్యాప్తు సంస్థ తరపున అడ్వకేట్‌ జనరల్ శ్రీరాం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు విచారణను వాయిదా వేసి తదుపరి విచారణ తేదీని నిర్ణయించనుంది. అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు విన్పిస్తూ... ఈ నేరంలో చాలా తీవ్రత ఉందని, నిందితుడైన మాజీ మంత్రి, అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే ఈ నేరం జరిగిందని కోర్టుకు తెలిపారు.

ఈ నేరంలో ఆయనే ప్రధాన సూత్రధారని, 2016 సెప్టెంబరు నుంచి కూడా ఆయా కంపెనీలకు అనుకూలంగా లేఖలు ఇచ్చినట్లు కోర్టుకు వెలడించారు. ఈ వివరాలన్నీ కూడా దిగువ కోర్టుకు సమర్పించామని చెప్పారు. సెప్టెంబరు 25, 2016లో అప్పటి మంత్రి నివాసంలో, ఆయన సమక్షంలో జరిగిన సమావేశం ఉద్దేశం ఏంటి అన్నది చూడాలన్నారు. ఈ మీటింగ్‌ మినిట్స్‌ను కూడా పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. ఆ రోజు సమావేశానికి హాజరైన వ్యక్తులందరినీ కూడా అరెస్టు చేశామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement