ఉండి రాజుల కోటలో అసమ్మతి సెగలు రగులు తున్నాయి. పార్టీని నమ్మిననేతలను చంద్రబాబు బలి పశువులను చేస్తుంటే.. కార్యకర్తల ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. నోట్ల కట్టలే పరమావదిగా రోజుల వ్యవధిలో పార్టీ కండువాలు మార్చే నేతలకు టిక్కెట్లు కేటాయిస్తుండటంతో.. సిట్టింగ్ నేతకు సైతం సీటు బెంగ పట్టుకుంది. ఉండి.. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకి ఎసరు పెట్టింది ఎవరు...? టీడీపీ మూడు ముక్కలు అవడానికి అసలు కారణాలేంటి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతిపక్ష కూటమి బీటలు వారుతోంది. నేతలు తలోదారి అన్నట్లుగా ఉండడంతో గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. ఇంతలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటన మరింత చిచ్చు రాజేసింది. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబునాయుడు నర్సాపురం, పాలకొల్లులో పర్యటించి రఘురామకృష్ణరాజును టీడీపీలో చేర్చుకున్నారు. పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ అభ్యర్థులతో పాటు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు ఖరారు చేసి రామరాజుకు హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తొలి జాబితాలో అభ్యర్థిగా ఖరారు చేయగా రామరాజు, ఆయన సతీమణి ఇద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రఘురామరాజుకు సీటు అనడంతో టీడీపీ కేడర్ పాలకొల్లులో చంద్రబాబు క్యాంపు వద్దకు చేరుకుని పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డగించి ఘెరావ్ చేశారు. రామరాజుకే సీటు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజుకు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నినాదాలు చేశారు. దీంతో నియోజకవర్గమంతో టిక్కెట్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు టిక్కెట్ కేటాయిస్తారనీ అశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శివ రామ రాజుకు చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో రెబల్ అభ్యర్థిగా మారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు రామరాజు టిక్కెట్ లేదనే సంకేతాలు ఇవ్వడంతో రామ రాజు వర్గంచంద్రబాబు పై కన్నెర్ర చేస్తుంది. ఉండిలో సైకిల్ పార్టీని భూ స్థాపితం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.రామ రాజు తన అనుచరులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
రఘు రామ కృష్ణo రాజు ఉండికి వస్తే సహించే ప్రసక్తే లేదనీ... రామరాజు వర్గం స్పష్టం చేశారు. దీంతో పశ్చిమ టీడీపీ కూటమి రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించాలని కార్యకర్తలు కాన్వాయ్‌కి అడ్డుగా వెళ్లి నిరసన తెలిపినా చంద్రబాబు నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్యకర్తలు నిరాశతోనే వెను తిరిగారు...రఘురామకృష్ణ రాజు రాకతో ఇప్పుడు ఉండి టీడీపీ మూడు ముక్కలైంది.ఇంతకీ ఎన్నికల బరిలో ఎవరు నిలవనున్నారు... ఉండి టీడీపీలో కుంపట్లు ఎప్పుడు చల్లారతాయో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment