Rama Raju
-
మూడు ముక్కలైన ‘ఉండి’ టీడీపీ
ఉండి రాజుల కోటలో అసమ్మతి సెగలు రగులు తున్నాయి. పార్టీని నమ్మిననేతలను చంద్రబాబు బలి పశువులను చేస్తుంటే.. కార్యకర్తల ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. నోట్ల కట్టలే పరమావదిగా రోజుల వ్యవధిలో పార్టీ కండువాలు మార్చే నేతలకు టిక్కెట్లు కేటాయిస్తుండటంతో.. సిట్టింగ్ నేతకు సైతం సీటు బెంగ పట్టుకుంది. ఉండి.. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకి ఎసరు పెట్టింది ఎవరు...? టీడీపీ మూడు ముక్కలు అవడానికి అసలు కారణాలేంటి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతిపక్ష కూటమి బీటలు వారుతోంది. నేతలు తలోదారి అన్నట్లుగా ఉండడంతో గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. ఇంతలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటన మరింత చిచ్చు రాజేసింది. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబునాయుడు నర్సాపురం, పాలకొల్లులో పర్యటించి రఘురామకృష్ణరాజును టీడీపీలో చేర్చుకున్నారు. పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ అభ్యర్థులతో పాటు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు ఖరారు చేసి రామరాజుకు హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తొలి జాబితాలో అభ్యర్థిగా ఖరారు చేయగా రామరాజు, ఆయన సతీమణి ఇద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రఘురామరాజుకు సీటు అనడంతో టీడీపీ కేడర్ పాలకొల్లులో చంద్రబాబు క్యాంపు వద్దకు చేరుకుని పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డగించి ఘెరావ్ చేశారు. రామరాజుకే సీటు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజుకు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నినాదాలు చేశారు. దీంతో నియోజకవర్గమంతో టిక్కెట్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు టిక్కెట్ కేటాయిస్తారనీ అశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శివ రామ రాజుకు చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో రెబల్ అభ్యర్థిగా మారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు రామరాజు టిక్కెట్ లేదనే సంకేతాలు ఇవ్వడంతో రామ రాజు వర్గంచంద్రబాబు పై కన్నెర్ర చేస్తుంది. ఉండిలో సైకిల్ పార్టీని భూ స్థాపితం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.రామ రాజు తన అనుచరులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రఘు రామ కృష్ణo రాజు ఉండికి వస్తే సహించే ప్రసక్తే లేదనీ... రామరాజు వర్గం స్పష్టం చేశారు. దీంతో పశ్చిమ టీడీపీ కూటమి రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించాలని కార్యకర్తలు కాన్వాయ్కి అడ్డుగా వెళ్లి నిరసన తెలిపినా చంద్రబాబు నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్యకర్తలు నిరాశతోనే వెను తిరిగారు...రఘురామకృష్ణ రాజు రాకతో ఇప్పుడు ఉండి టీడీపీ మూడు ముక్కలైంది.ఇంతకీ ఎన్నికల బరిలో ఎవరు నిలవనున్నారు... ఉండి టీడీపీలో కుంపట్లు ఎప్పుడు చల్లారతాయో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ఉండి అభ్యర్థిని మారిస్తే ఉండేలుదెబ్బే
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్, సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా రెండో రోజు పర్యటనలో చంద్రబాబుకు సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. ఉండి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నట్టు ఇచ్చిన సంకేతాలపై కార్యకర్తలు ఆయనపై తిరగబడ్డారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తును తగలబెట్టిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు.. రామరాజును కాదని రఘురామకృష్ణరాజుకు టికెటిస్తే చిత్తుగా ఓడిస్తామంటూ చంద్రబాబు ఎదుటే తేల్చిచెప్పారు. ఉండి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరును చంద్రబాబు మొదటి జాబితాలోనే ప్రకటించారు. ఈ మేరకు రామరాజు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఉండి సీటు తనదేనని, రెండు మూడు రోజుల్లో చంద్రబాబు ప్రకటిస్తారని రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో చెబుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఎమ్మెల్యే రామరాజు వర్గానికి మింగుడు పడలేదు. ఈ తరుణంలో అభ్యర్థి మార్పుపై చంద్రబాబు ఇచ్చిన సంకేతాలు పార్టీ క్యాడర్లో అగ్గిరాజేశాయి. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు ఎస్ కన్వెన్షన్ హాలులో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కూటమి అభ్యర్థులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశానికి ఉండి ఎమ్మెల్యే రామరాజుతోపాటు రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరాజుకు ప్రచారం స్పీడు తగ్గించాలని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమాచారంతో ఉండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే రామరాజు అనుచరులు పాలకొల్లులోని ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుని బయటే బైఠాయించి నిరసనకు దిగారు. రామరాజును మారిస్తే తమ సత్తా చూపిస్తామని, ఉండిలో పార్టీ విజయాలకు బ్రేక్ వేస్తామని హెచ్చరించారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబును అడ్డుకునే యత్నం చేశారు. చంద్రబాబు వారికి సమాధానం చెప్పకుండా సెక్యూరిటీ సిబ్బంది సాయంతో వెళ్లిపోయారు. ఉండి కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నోఏళ్లుగా పార్టీ విజయానికి పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బ్రోకర్‌కు టికెట్టా! రాజకీయ బ్రోకర్‌గా, వివాదాస్పదుడిగా ముద్రపడిన రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడడమేమిటని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అసలు ఈ ఉదంతంలో చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ ఆ పార్టీలో తన ఆటలు సాగకపోవడంతో కొద్దినెలలకే రాజకీయ బ్రోకర్‌గా మారి టీడీపీకి, చంద్రబాబుకు ఆప్తుడిగా మారిపోయారు. ఆయనకు అనుకూలంగా పనిచేశారు. చంద్రబాబు చేసిన కుట్రలన్నీ రఘురామకు తెలుసని, అందుకే ఇప్పుడు ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. రఘురామ కూటమి తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏడాది క్రితమే ప్రకటించారు. బీజేపీలో చేరి నర్సాపురం ఎంపీ సీటు తెచ్చుకోవాలని కలలు కన్నారు. కానీ బీజేపీ అందుకు అంగీకరించలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో తన సంగతి తేల్చాలని చంద్రబాబుపై రఘురామ ఒత్తిడి తెచ్చారు. ఇంతకాలం అన్ని పనులకూ ఆయనను ఉపయోగించుకున్న కారణంగా రఘురామ బాధ్యత చంద్రబాబుపైనే పడింది. -
‘ఉండి’ టీడీపీలో నువ్వా? నేనా?
ఉండి: పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశానికి కంచుకోటగా చెప్పుకొనే ఉండి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు రోడ్డెక్కాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఉండి రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఉన్న టీడీపీ మండల కార్యాలయం ముందు ఆదివారం టీడీపీ నాయకులు నిరసనదీక్ష చేపట్టారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొని శ్రేణులను ఉత్సాహపరుస్తూ వారితో నిరసనకు దిగారు. అనంతరం శిబిరంలోకి ఎమ్మెల్యే రామరాజు వచ్చారు. కొద్దిసేపటి తరువాత మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆ శిబిరానికి పక్కనే మరో శిబిరం ఏర్పాటు చేయించి అందులో కూర్చుని నిరసన చేపట్టారు. దీంతో ఆయన అనుచరులు కూడా ఆ శిబిరంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల విభేదాలు మరోసారి రోడ్డెక్కడంతో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. చాలామంది మాజీ ఎమ్మెల్యే శివరామరాజు శిబిరంలోకి చేరి ఆయనకు మద్దతు తెలపడంతో విభేదాలు మరింత పెరిగాయి. ఈ మధ్యకాలంలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకునేందుకే టీడీపీ నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుగానీ వారికి చిత్తశుద్ధి లేదంటూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రస్తుత ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దూషణలకు దిగారు. ఉండి టీడీపీ కంచుకోటకు బీటలువారాయని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. -
పెరూ పుంజు.. వచ్చెనండి.. కాసులు తెచ్చెనండీ!
కోనసీమలో ఒక కొబ్బరి చెట్టునో, ఒక గేదెనో.. ఒక ఎకరం భూమినో నమ్ముకుని ఆదాయం పొందుతూ ఏదోలా బతికేద్దామని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తాను అలా అనుకోలేదంటున్నారు పెన్మెత్స రామ సత్యనారాయణరాజు అలియాస్ ఈస్ట్ గోదావరి రామరాజు. నేడు భూములు, పశువులు, కొబ్బరి చెట్ల వల్ల ఆదాయం అంతగా లభించక కొంతమంది ఉన్నత చదువులతో ఉన్నత రంగాలకు వెళ్లిపోతున్నారు. కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన ఈ యువకుడు కేవలం ఒక కోడిపుంజును నమ్ముకున్నాడు, తద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తున్నాడు. – మలికిపురం ఈస్ట్ గోదావరి రామరాజు (32) బీటెక్ పూర్తి చేశారు. తండ్రి వేంకటేశ్వరరాజు రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబం కోసం ఉద్యోగం ఆలోచన విరమించుకుని రామరాజు బట్టేలంకలోనే ఉంటున్నారు. ఈయనకు ఇదే మండలం ఇరుసుమండ గ్రామంలో 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అదీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి పంచుకోగా వచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో కోనసీమలో పలువురు చేస్తోన్న మాదిరిగానే రామరాజు దేశవాళీ కోడిపుంజులు పెంచుతూ సంక్రాంతి సమయంలో అమ్ముతు ఉంటారు. ఇందులోనూ అంతంత మాత్రంగానే ఆదాయం వస్తుండటంతో ఆయన సరికొత్త ఆలోచన చేశారు. పుంజుకూ వీసా..! అమెరికాలో పరిచయమున్న వారి ద్వారా రామరాజు ‘పెరూ’ జాతి కోడిపుంజును అక్కడి ధర రూ.1.40 లక్షలకు 2020 జూన్‌లో కొనుగోలు చేశారు. పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఖర్చులతో పాటు విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్‌ను కొనుగోలు చేసి ఆ కోడిపుంజును అమెరికా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారైన కారులో ఇరుసుమండలోని రామరాజు కొబ్బరి తోటలోకి పుంజు చేరింది. ఈ పుంజును అన్నీ కలుపుకొని ఇక్కడకు తీసుకురావడానికి రామరాజుకు రూ.2.85 లక్షలు ఖర్చయ్యింది. అప్పటి నుంచీ ఈ పెరూ జాతి కోడిపుంజును రాజభోగాలతో రామరాజు మేపుతున్నారు. మేలు రకాలయిన దేశవాళీ పెట్టల క్రాసింగ్ ద్వారా దీని సంతానం విపరీతంగా పెరిగింది. ఈ జాతి పుంజులు పందాల్లో విశేష ప్రతిభ చూపడంతో దీని బ్రీడ్‌కు డిమాండ్ పెరిగింది. రామరాజు కోడిపుంజులను పెంచడం లేదు. వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు మాత్రమే పెంచి అనంతరం ఒక్కో పిల్లను రూ.10,000కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.41.60 లక్షల ఆదాయం వచ్చినట్లు రామరాజు చెప్పారు. దీనిలో నెలకు రూ.25 వేల చొప్పున ఖర్చవుతుందని, రూ.35.60 లక్షలు మిగిలిందని వెల్లడించారు. దండిగా ఆదాయం ప్రస్తుతం కొబ్బరి ఆదాయం తోటల నిర్వహణకే సరిపోతోంది. దీంతో ఇలా ప్రయోగం చేసి ఈ కోడిపుంజును దింపాను. రెండేళ్లలో రూ.41.60 లక్షల షేర్ వచ్చింది. నిర్వహణ ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగా ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షలు పైగా మిగులుతుంది. – పెన్మెత్స రామ సత్యనారాయణ రాజు, బట్టేలంక -
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘అడ్డతీగల’
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడడానికి ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ‘అడ్డతీగల’ సిద్ధమవుతుంది. మీడియా గ్రాఫిక్స్ విభాగంలో విశేష అనుభవమున్న గాదిరాజు రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్‌బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్-వాసంతి కృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటించారు. శ్రీ శృంఖలా దేవి ఫిలిమ్స్ బ్యాపర్‌పై రాధికా రామరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాటలను సీనియర్ జర్నలిస్టు, లిరిక్ రైటర్ పూడి శ్రీనివాసరావు అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా OTTలో ఉంది. ‘క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక సాఫ్ట్ వేర్ జంట వీకెండ్ కోసం అడ్డతీగల , మారేడుమల్లి అటవీ ప్రాంతానికి వచ్చి అక్కడ సీరియల్ కిల్లర్ బారినపడి ఎలా తప్పించుకొన్నారు అనేది సినిమా సారాంశం’ అని చిత్ర బృందం పేర్కొంది. -
వినూత్న చిత్రం '@లవ్' ..ప్రతి పాత్రకు ఓ కథ ఉంటుంది
రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సుందర్ ముఖ్య తారలుగా, శ్రీ నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ ‘ 2లవ్’. టిఎమ్మెస్, ప్రీతమ్ ఆర్ట్స్ అండ్ ఎస్ఎన్ క్రియేషన్స్ బేనర్స్ పై మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల, శ్రీనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈ 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీనారాయణ మాట్లాడుతూ– ‘‘గిరిజనుల నేపథ్యంలో తెరకెక్కిన స్వచ్ఛమైన ప్రేమకథే ఈ చిత్రం. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఓ కథ ఉంటుంది. ప్రతి ఎమోషన్ కథను నడిపిస్తుంటుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు జర్నీఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది’అన్నారు. -
రామరాజు పాస్‌పోర్ట్ ఇచ్చేయండి
సత్యం కంప్యూటర్స్ కేసులో అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్ పూర్వ ఎండీ బైర్రాజు రామరాజు పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. గురువారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తన పాస్‌పోర్టును తిరిగిచ్చేలా ఆదేశించాలని కోరుతూ రామరాజు కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. సత్యం కేసులో అప్పీల్‌పై విచారణ జరుగుతున్న కోర్టుకు డాక్యుమెంట్లను పంపాల్సి ఉన్నందున పాస్‌పోర్టును తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని కింది కోర్టు చెప్పడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. విచారణ పత్రాల్లో పాస్‌పోర్ట్ లేనప్పుడు ఇచ్చేందుకు అభ్యంతరం ఏముంటుందన్న న్యాయమూర్తి, దాన్ని రామరాజుకు ఇచ్చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఒక మనసు తరువాత చీకటి ప్రేమకథ..?
ఇప్పటి వరకు మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథలను అందించిన దర్శకుడు రామరాజు ఇప్పుడు రూటు మారుస్తున్నాడు. ఇటీవల మెగా వారసురాలు నిహారికను హీరోయిన్గా పరిచయం చేస్తూ ఒక మనసు సినిమా తెరకెక్కించిన రామరాజు, తన నెక్ట్స్ సినిమాను మాత్రం ఓ మాస్ మాసాలా ఎంటర్టైనర్గా మలిచే ఆలోచనలో ఉన్నాడట. వరుసగా మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు, ఒక మనసు లాంటి ఆర్టిస్టిక్ సినిమాలను అందించిన రామరాజు తన నెక్ట్స్ సినిమా కోసం మాస్ ప్రేమ కథను రెడీ చేశాడు. ఒక మనసు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మధుర శ్రీధర్ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకు చీకటి ప్రేమకథ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. -
'ఒక మనసు' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక మనసు జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : నాగశౌర్య, నిహారిక, రావూ రమేష్, ప్రగతి సంగీతం : సునీల్ కశ్యప్ దర్శకత్వం : రామరాజు నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి ఇటీవల కాలంలో సార్ట్ వారసుల హవా బాగా కనిపిస్తుండటంతో అదే బాటలో మెగాఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చింది కొణిదల నీహారిక. నాగబాబు కూతురిగా, పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న నీహారిక, తొలిసారిగా ఒక మనసు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. మరి వెండితెర మీద మెరసిన తొలి మెగా వారసురాలు ఆకట్టుకుందా..? హీరోయిన్ గా సక్సెస్ కొట్టాలన్న నీహారిక కల నెరవేరిందా..? కథ : సూర్య (నాగశౌర్య) రాజకీయ నాయకుడు కావాలన్న ఆశతో విజయనగరంలో సెటిల్మెంట్స్ చేస్తూ తిరిగే అబ్బాయి. సూర్య మామయ్య ఎమ్మెల్యే కావటంతో ఏ రోజుకైనా సూర్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని కలకంటుంటాడు సూర్య తండ్రి (రావు రమేష్). విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో హౌస్ సర్జన్‌గా చేస్తున్న సంధ్య (నీహారిక), సూర్యని తొలి చూపులోనే ఇష్టపడుతుంది. తరువాత ఆ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో తన రాజకీయ అవసరాల కోసం ఓ పెద్ద సెటిల్మెంట్ ఒప్పుకున్న నాగశౌర్య చిక్కుల్లో పడతాడు. నమ్మకద్రోహం కారణంగా కోర్టు కేసులో ఇరుక్కుని మూడేళ్లపాటు జైలులో ఉంటాడు. ఆ తరువాత బెయిల్ వచ్చినా కేసు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి సంధ్యకు దగ్గరవుతాడు సూర్య. కానీ తన తండ్రి కలను నెరవేర్చటం కోసం ఈ సారి సంధ్యకు శాశ్వతంగా దూరం కావలసిన పరిస్థితి వస్తుంది. మరి సూర్య నిజంగానే సంధ్యను దూరం చేసుకున్నాడా.? సూర్య వదిలి వెళ్లిపోవటానికి సంధ్య అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రల్లో కనిపించిన నాగశౌర్య ఈ సినిమాలో కాస్త పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో తండ్రి కల, అమ్మాయి ప్రేమకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. తొలిసారిగా వెండితెర మీద మెరిసిన నిహారిక పరవాలేదనిపించింది. లుక్స్ పరంగా హుందాగా కనిపించిన నిహారిక, నటన పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తండ్రి పాత్రలో రావూ రమేష్ మరోసారి ఆకట్టుకున్నాడు. కొడుకు భవిష్యత్తు కోసం తపన పడే తండ్రిగా రావూ రమేష్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ఫ్రెండ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, చిన్న కామెడీ పాత్రలో వెన్నెల కిశోర్ తమ పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : నీహారికను హీరోయిన్గా ఎంచుకొని సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు రామరాజు, మరోసారి తన మార్క్ పోయటిక్ టేకింగ్ తో ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ స్లో నారేషన్ కాస్త ఇబ్బంది పెట్టినా.. రిచ్ విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి, సినిమా చాలా వరకు హీరో హీరోయిన్ల మధ్య మాటలతోనే నడిపించిన దర్శకుడు, డైలాగ్స్ పై మరింతగా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం, రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం ఆకట్టుకుంటాయి. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. వైజాగ్ బీచ్ అందాలను, అరకు పచ్చదనాన్ని మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫీ మెయిన్ స్టోరీ ప్రీ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ డైలాగ్స్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
నీహా అని పిలిస్తే పలికేది కాదు!
మహా గ్రంథాలను వర్ణించగలం గానీ... ప్రేమను నిర్వచించలేం. అదొక అంతులేని అగాథం... అందుకోలేని ఆకాశం. ఇంత క్లిష్టమైన ప్రేమను రెండున్నర గంటల సినిమాగా చూపించేందుకు ఎందరో ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందులో రామరాజు ఒకరు. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి హృదయాన్ని హత్తుకునే సినిమా రూపొందించిన రామరాజు... ఇప్పుడు ‘ఒక మనసు’ అంటూ... మరో ప్రణయకావ్యాన్ని తెరకెక్కించారు. నేడు విడుదల కానున్న ఈ చిత్రవిశేషాలను రామరాజు ఇలా చెప్పారు... స్వార్థం తెలీనిది, షరతుల్లేనిదే స్వచ్ఛమైన ప్రేమ. నీ మీద ప్రేమ చావదు.. మరొకరి మీద ప్రేమ పుట్టదంటారు నిజమైన ప్రేమికులు. ఒక మనసు కథలో చెప్పిందిదే. ప్రేమ అనేది ఒక స్థితి (కండీషన్). ఇది ఒక గంటా, ఒక రోజా, ఒక నెలా అనేదాన్ని బట్టి ప్రేమ లోతు చెప్పొచ్చు. ఇదే ప్రేమ జీవితాంతం నిలుపుకుంటుందిసంధ్య. ఈ పాత్రను నీహారిక అద్భుతంగా చేసింది. కథ పరంగా కథానాయకుడి పాత్ర కంటే సంధ్య పాత్రకే కాస్త ప్రాధాన్యం ఉంటుంది. సంధ్య పాత్రలో నిహారిక, సూర్య క్యారెక్టర్లో నాగశౌర్య వాళ్ల నటనతో దర్శకుడిగా నా ఊహలకు రూపమిచ్చారు. నా గత చిత్రం లాగే ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. నీహారిక అనగానే మొదట కొంచెం టెన్షన్ ఉండేది. మెగా కుటుంబం నుంచి వస్తోన్న అమ్మాయి కదా, చాలా అబ్జెక్షన్స్ ఉంటాయేమో అనుకున్నా. కానీ ‘సంధ్య’ పాత్రకు ఆమె కరెక్ట్ అనిపించి, తన తల్లిదండ్రుల సమక్షంలో కథ వినిపించా. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఇంతటితో వదిలేద్దాం అని చెప్పా. కానీ, ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఆమె ‘సంధ్య’ పాత్రలో ఎలా లీనమైందంటే.. సెట్లో ‘నీహా’ అని పిలిస్తే పలికేది కాదు.. సంధ్య అంటేనే పలికేది. నాగశౌర్య అప్ కమింగ్ యువ రాజకీయ నాయకునిగా ‘సూర్య’ పాత్రలో కనిపిస్తాడు. తన పాత్రకి వందశాతం న్యాయం చేశాడు. సమాజంలోనే కాదు.. మన జీవితాల్లో కూడా రాజకీయం ఉందనే విషయం తన పాత్ర ద్వారా చెప్పాం. నా దృష్టిలో కమర్షియల్ చిత్రమంటే భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించడం కాదు. తక్కువ బడ్జెట్లో చేసిన చిత్రాలు బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు రాబడితేనే అది అసలైన కమర్షియల్ చిత్రం. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్రం కంటే ‘ఒక మనసు’ వేగంగా సాగుతుంది. ఈ సినిమా తర్వాత మధుర శ్రీధర్‌రెడ్డి బ్యానర్లోనే ఓ ప్రేమకథా చిత్రం చేయబోతున్నా. -
సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష
-
సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష
ఐదేళ్ల క్రితం నాటి సత్యం కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఎట్టకేలకు తీర్పును వెలువరించింది. మొత్తం ఆరు కేసులకు సంబంధించి ఈ కోర్టు తన తీర్పును సోమవారం వెల్లడించింది. సత్యం రామలింగరాజు, రామరాజుకు మూడు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. అలాగే వారితో పాటు రామ్ మైనంపాటికి కూడా రూ. 10 లక్షల జరిమానా విధించారు. మరో రెండు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. రామలింగరాజు, రామరాజులకు ఒక్కో కేసులో ఆరునెలల పాటు నాలుగు కేసుల్లో జైలుశిక్ష కూడా విధించారు. ఎస్ఎఫ్ఐఓ మొత్తం ఏడు కేసులు నమోదు చేయగా, వాటిలో ఒక కేసును కోర్టు కొట్టేసింది. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. వడ్లమాని శ్రీనివాస్‌కు మూడు కేసుల్లో రూ. 20 వేల జరిమానా, మూడు కేసుల్లో 6 నెలల జైలుశిక్ష విధించారు. సంస్థ మాజీ డైరెక్టర్లు కృష్ణ జి.పాలెపు, ఎన్.శ్రీనివాస్, వినోద్ కె. దామ్, టి.ఆర్. ప్రసాద్‌లకు రూ. 20 వేల వంతున జరిమానాలు విధించారు. ఐదేళ్ల క్రితం.. అంటే 2009 సంవత్సరంలో సత్యం స్కాం బయటపడి ఒక్కసారిగా ఐటీ రంగాన్ని పెద్ద కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. దాదాపు 147 కోట్ల డాలర్ల ఈ కుంభకోణం ఫలితంగా గ్రూపు ఛైర్మన్ రామలింగరాజు 2009 జనవరి 7వ తేదీన తన పదవులకు రాజీనామా చేశారు. అదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో సీబీఐ ఈ కేసు విచారణ బాధ్యతలను తీసుకుంది. తర్వాతి నుంచి పలు మలుపులు తిరిగింది. చివరకు ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టులో కూడా ఈ కేసుల విచారణ సాగింది. ఇప్పుడు దానికి సంబంధించి తీర్పు వెలువడింది. -
హిందువులపై దాడులు సహించం
కోహీర్: హిందువులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు స్పష్టం చేశారు. బుధవారం కోహీర్ మండలం కవేలి గిరిజా సంగమేశ్వర స్వామి ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన హిందూ మత సంస్థల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిందూ సంస్కృతి మహోన్నతమైందన్నారు. అనేక శతాబ్దాలుగా దాడులు, అవమానాలను భరిస్తూ వచ్చిందన్నారు. సహనానికి మారుపేరైన హిందువులపై ఇంకా ఇతర మతస్థులు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. మండలంలోని గురుజువాడ గ్రామంలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలపై ఇతర మతస్థులు దాడి చేసి గాయపరచడం సహించరాని విషయమన్నారు. నిందితులపై చర్య తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అవమానానికి గురైన చోటి నుంచి రథయాత్రను తిరిగి ప్రారంభించడానికి ఆవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసి గాయపరిచిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు హేమంత్ సంగ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బల్వంత్ రావు, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు పన్యాల ప్రభాకర్, బజరంగ్ దళ్ విభాగ్ ప్రముఖ్ సుభాష్, ఓంకార్ ఎకాల్ విద్యాలయ ప్రముఖ్ శంకర్, నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లికార్జున్ పాటిల్, నాయకులు సుధీర్ బండారీ, శివకుమార్, విశ్వనాథ్, మొగులయ్య, సిద్ధేశ్వర్, నరేష్ పాల్గొన్నారు. -
జాతీయ అవార్డుల జ్యూరీలో సీవీ రెడ్డి
ప్రముఖ దర్శక, నిర్మాత, నవలా రచయిత సీవీ రెడ్డి 2013 జాతీయ చలన చిత్ర అవార్డుల నిర్ణాయక కమిటీ జ్యూరీ సభ్యునిగా ఎంపికయ్యారు. బదిలీ, వసంత, విజయ రామరాజు, శ్వేతనాగు తదితర చిత్రాలు నిర్మించిన సీవీ రెడ్డి గతంలో ఇండియన్ ఆస్కార్ జ్యూరీలోను, ఇండియన్ పనోరమా జ్యూరీలోనూ పని చేశారు. ‘బదిలీ’ చిత్రానికి నంది పురస్కారం అందుకున్న ఆయన త్వరలో ఓ విభిన్న చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.