క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘అడ్డతీగల’ | Addateegala Movie Release Date Out | Sakshi
Sakshi News home page

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘అడ్డతీగల’

Published Thu, May 25 2023 5:51 PM | Last Updated on Sat, Jul 15 2023 4:14 PM

Addateegala Movie Release Date Out - Sakshi

క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలను చూడడానికి ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ‘అడ్డతీగల’ సిద్ధమవుతుంది. మీడియా గ్రాఫిక్స్ విభాగంలో విశేష అనుభవమున్న గాదిరాజు రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్‌బాస్‌ ఫేం అర్జున్‌ కళ్యాణ్‌-వాసంతి కృష్ణన్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. శ్రీ శృంఖలా దేవి ఫిలిమ్స్ బ్యాపర్‌పై రాధికా రామరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాటలను సీనియర్ జర్నలిస్టు, లిరిక్ రైటర్ పూడి శ్రీనివాసరావు అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా OTTలో ఉంది.

‘క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక సాఫ్ట్ వేర్ జంట  వీకెండ్ కోసం అడ్డతీగల , మారేడుమల్లి అటవీ ప్రాంతానికి వచ్చి అక్కడ సీరియల్ కిల్లర్ బారినపడి ఎలా తప్పించుకొన్నారు అనేది సినిమా సారాంశం’ అని చిత్ర బృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement