రఘురామకృష్ణరాజుకు రిమాండ్‌ | Mp Raghurama Krishnamraju Remand Till 28 May Cid Court | Sakshi
Sakshi News home page

రఘురామకృష్ణరాజుకు రిమాండ్‌

Published Sat, May 15 2021 9:12 PM | Last Updated on Sun, May 16 2021 2:12 AM

Mp Raghurama Krishnamraju Remand Till 28 May Cid Court - Sakshi

సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీబీసీఐడీ కోర్టు రిమాండ్‌ను విధించింది. ఈ నెల 28 వరకు రఘురామకృష్ణరాజు రిమాండ్‌కు  కోర్టు అనుమతి ఇచ్చింది.  ఆయనను జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఈ సాయంత్రం రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్‌ కోర్టులో హాజరుపర్చారు.  సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్‌ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. ఈ ఉదయం రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. 

రఘురామ అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్‌ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అదే సమయంలో రఘురామకృష్ణరాజుతో పాటు TV5, ABNలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా TV5, A3గా ABNలపై కేసులు ఫైల్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement