CID court
-
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
-
చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ. పేదలు, మధ్య తరగతివర్గాల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీరావు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ధ్వజమెత్తింది. ‘ష్యూరిటీలు ఇచ్చినా కొర్రీలు వేస్తోంది. చిట్టీల ఉచ్చులో బిగించి మా ఆస్తులు కొల్లగొడుతోంది. ప్రైజ్‌మనీ ఇవ్వకుండా మా అనుమతి లేకుండానే రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది’ అని దుయ్యబట్టింది. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను ఇక సహించేది లేదు. సంఘటితంగా పోరాడతాం. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. రామోజీరావు అక్రమాలపై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు బుధవారం విజయవాడలో సంఘటితమయ్యారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చందాదారులు తరలివచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీ కట్టి మోసపోయిన విధానం, తాము పడుతున్న ఇబ్బందులు, పోగొట్టుకున్న ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతివర్గాల ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోకుండా తలకు మించి చిట్టీలు కట్టిస్తూ రామోజీరావు వారిని చిట్టీల ఊబిలోకి నెట్టివేసి, వారి ఆస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ష్యూరిటీలు సమ ర్పించినవారికి కూడా చిట్టీ ప్రైజ్‌మనీ ఇవ్వకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తున్నారన్నారు. రామోజీరావు అక్రమాలతో సామాన్యులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని, అయినా అప్పులు తీరక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో రూ.20 లక్షల చిట్టీ కట్టించి వేధిస్తున్నారన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ గూండాలు ఇంటిపైకి వచ్చి వేధింపులకు గురిచేయడంతో కర్నూలులో ఒకరు తీవ్ర మానసిక క్షోభతో పక్షవాతం బారిన పడ్డారని తెలిపారు. రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పేద, మధ్య తరగతి వర్గాల వారిని ఒక చిట్టీతో మొదలుపెట్టి అయిదు.., పది.., ఇరవై వరకు చిట్టీల్లో సభ్యులుగా చే ర్పించి వారు అప్పులు, వాయిదాల ఉచ్చు నుంచి బయటకు రాలేని దుస్థితి కల్పిస్తున్నారని వివరించారు. ఒక చిట్టీ ప్రైజ్‌మనీని మరో చిట్టీలోకి సర్దుబాటు చేస్తూ చందాదారులకు చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడంలేదని తెలిపారు. చందాదారులందరినీ సంఘటితం చేసేందుకే ఈ సంఘం మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు కొన్ని వేల మంది ఉన్నారని, వారందరినీ సంఘటితం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్ 22, 66 ప్రకారం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు సమష్టిగా పోరాడతామన్నారు. అందుకు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయని చెప్పారు. కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నేలా రామోజీ అక్రమాలు సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నే రీతిలో రామోజీరావు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చందాదారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తూ వారిని శాశ్వతంగా రుణగ్రస్తులుగా ఉండేట్టు కుట్ర పన్నుతున్నారన్నారు. తమ కుటుంబం రెండు చిట్టీలతో మొదలు పెడితే.. తరువాత ఏకంగా 40 చిట్టీల వరకు చేర్చించి మోసం చేశారన్నారు. రూ.80 లక్షల చిట్టీ పాట పాడితే రూ.215 మాత్రమే ఇచ్చారని, రూ.40 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు పాడినా ఒక్క దానికి కూడా రూ.200కు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం చందాదారులకు కల్పిస్తున్న రక్షణ పట్ల చాలామందికి అవగాహన లేకపోవడాన్ని రామోజీరావు తన దుర్మార్గాలకు అనుకూలంగా మలచుకుంటున్నారని అన్నారు. అందుకే చందాదారుల్లో చైతన్యం తీసుకొచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. – సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు ఇళ్లపై పడి వేధిస్తున్నారు.. ఆస్తులు గుంజుకున్నారు ‘మా సంతకాలు ఫోర్జరీ చేసి కొత్త చిట్టీ గ్రూపుల్లో చే ర్పించారు. మాకు తెలియకుండానే పాట పాడి ఆ మొత్తాన్ని అప్పుల కింద జమ చేసుకున్నామని చెప్పారు. 90 చిట్టీల్లో చే ర్పించి మమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అవి తీర్చడం కోసం మా ఇల్లు, స్థలాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న మా అమ్మాయి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆమెను కూడా చందాదారుగా చే ర్పించారు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైజ్‌మనీ డబ్బును వాళ్లే తీసుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇంటి మీదకు గూండాలను పంపించి తీవ్రంగా వేధిస్తున్నారు’ అని సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి ఆవేదనతో చెప్పారు. – సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి నా అనుమతి లేకుండానే నా డబ్బు డిపాజిట్ చేసేశారు నేను చిట్టీ పాడి నిబంధనల ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా ప్రైజ్‌మనీ ఇవ్వడంలేదు. నా అనుమతి లేకుండానే డిపాజిట్‌గా జమ చేసేశారు. అలా ఎందుకు చేశారు అని గట్టిగా అడిగితే భవిష్యత్ చందాల కోసం డిపాజిట్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా ప్రతి ఆరు నెలలకు వాళ్లే డిపాజిట్లను రెన్యూవల్ చేస్తూ రెండేళ్లుగా ప్రైజ్‌మనీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలా వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – విశ్వప్రసాద్, బాధితుడు ష్యూరిటీలు ఇచ్చినా వేధిస్తున్నారు మేము చిట్టీ పాడితే, ఆ ప్రైజ్ మనీ ఇవ్వడానికి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు కావాలని చెప్పారు. నేను నలుగురితో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా చాలదు అన్నారు. ఆరుగురు.. తరువాత ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినా మా ప్రైజ్‌మనీ మాత్రం ఇవ్వలేదు. పైగా ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం ఈ సంఘంలో సభ్యునిగా చేరాను. – నందిగం వరప్రసాద్, హైదరాబాద్ ‘మార్గదర్శి’పై కఠిన చర్యలు తీసుకోండి హోం శాఖ, సీఐడీకి బాధితుల విజ్ఞప్తి సాక్షి, అమరావతి: చందాదారులను మోసగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ మోసాలకు అడ్డుకట్ట వేసి చందాదారులకు న్యాయం చేయాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి.సాంబశివరావు, కార్యదర్శి వి.అన్నపూర్ణమ్మ, ఇతర ప్రతినిధులు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్‌కు బుధవారం విడివిడిగా వినతిపత్రాలు సమ ర్పించారు. ష్యూరిటీలు సమ ర్పించినా చందాదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. చందాదారుల సొమ్మును రామోజీరావు సొంత వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్లు 22, 64 ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు తీసుకుని చందాదారులకు అండగా నిలవాలని కోరారు. -
మాజీ మంత్రి నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు.. : పొంగూరి ప్రియ
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీకి విజ్ఞప్తులు చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని.. కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని.. అలా చేస్తే దర్యాప్తునకు సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ మేరకు సీఐడీకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ‘మీ విచారణలో మాత్రం ఆయనకు ఇవేమీ గుర్తు రావు. కాబట్టి మీ ఎంక్వైరీలో నన్ను కూడా విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది’ అని ఆ వీడియోలో పొంగూరి ప్రియ పేర్కొన్నారు. -
ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణంలో నిందితుడు చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీచేసేందుకు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అనుమతించింది. చంద్రబాబును సోమవారం విజయవాడ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్న ఆయన్ని ఆ కేసుల్లో వేర్వేరుగా అరెస్ట్ చేసి విచారించేందుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పీటీ వారంట్ పిటిషన్లు దాఖలు చేసింది. ఫైబర్‌నెట్ కుంభకోణంలో పీటీ వారంట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ న్యాయవాదులు.. చంద్రబాబు ప్రధాన కుట్రదారుగా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని వివరించారు. పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరమే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. సీఐడీ న్యాయవాదుల వాదనలతో సంతృప్తి చెందిన న్యాయస్థానం చంద్రబాబుపై పీటీ వారంట్‌ను అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీచేసింది. ఆ సమయంలో చంద్రబాబు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనుందని చెప్పారు. అందుకే చంద్రబాబును సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించినట్టు న్యాయాధికారి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలలోపు చంద్రబాబును విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయానికి లోబడే తమ తీర్పు ఉంటుందని చెప్పారు. ప్రత్యేక పీపీపై దాడికి యత్నించిన టీడీపీ న్యాయవాదులు ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబుపై పీటీ వారంట్‌కు అనుమతించడంతో చంద్రబాబు న్యాయవాదులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. దాంతో వారు దాఖలు చేసిన కాల్ రికార్డ్స్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ న్యాయవాదిగా ఉన్న ప్రత్యేక పీపీ వివేకానందపై ఒకదశలో దాడికి తెగబడటం న్యాయస్థానాన్ని విస్మయానికి గురిచేసింది. ఒకనొక దశలో తీవ్ర వాగ్వాదంతో న్యాయస్థానం దద్దరిల్లింది. టీడీపీ న్యాయవాదుల వైఖరితో న్యాయాధికారి నిశ్చేష్టురాలయ్యారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు.. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారిస్తున్న, చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలని కోరుతూ టీడీపీ న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. సీఐడీ అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఆ విధి నిర్వహణలో భాగంగానే కేసు దర్యాప్తు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ఆయన అరెస్ట్ సక్రమమని గుర్తించే న్యాయస్థానం రిమాండ్ విధించిందని గుర్తుచేశారు. కానీ కేవలం రాజకీయ దురుద్దేశంతో సీఐడీ అధికారుల కాల్ రికార్డులు భద్రపరచాలని టీడీపీ కోరుతోందన్నారు. అలా చేయడం సీఐడీ అధికారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని న్యాయస్థానానికి నివేదించారు. గతంలో కొన్ని న్యాయస్థానాలు ఇచ్చిన ఇటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వివేకాంంద వాదనలపై టీడీపీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించింది. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని టీడీపీ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు అన్నారు. అసలు పిటిషన్‌కే అర్హత లేదని ప్రత్యేక పీపీ వివేకానంద బదులిచ్చారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ న్యాయవాది లక్ష్మీనారాయణ ఒక్కసారిగా ప్రత్యేక పీపీ వివేకానందపైకి దూసుకెళ్లారు. సీఐడీ తరఫున లీగల్ సబ్మిషన్లు చెబుతున్న ఆయనపైకి దూసుకెళ్లి అత్యుత్సాహంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినవారికి బెయిల్ ఇస్తారని ఈ కేసుతో సంబంధంలేని అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కేసులో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని లక్ష్మీనారాయణను న్యాయాధికారి ఆగ్రహంగా ప్రశ్నించారు. లక్ష్మీనారాయణ తీరుపై వివేకానంద కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరుపక్షాల న్యాయవాదుల వాగ్వాదంతో న్యాయస్థానం కాసేపు దద్దరిల్లింది. న్యాయస్థానంలో అతిగా ప్రవర్తిస్తున్న వారిపేర్లను నమోదు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. న్యాయవాదులు లక్ష్మీనారాయణ, నాగరాజు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్‌లో ఉన్నారా అని న్యాయాధికారి ప్రశ్నించారు. వారిద్దరూ ఆ జాబితాలో లేరని చంద్రబాబు న్యాయవాదులు సమాధానం చెప్పారు. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్‌లో ఉన్నవాళ్లు తప్ప అందరూ బయటకు వెళ్లాలని ఆదేశించిన జడ్జి.. ఈ విధంగా ఉంటే తాను ఈ కేసు విచారించాలేనని పేర్కొంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బెంచ్‌దిగి వెళ్లిపోయారు. -
చంద్రబాబు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి: మంత్రి ధర్మాన
దర్యాప్తు సంస్థలకు సహకరించి మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. మీరు దర్యాప్తు సంస్థలను నమ్మడం లేదు..మేం మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు ఈ విధంగా సభ్య సమాజాన్ని రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలి. అమాయక జనాన్ని రెచ్చగొట్టి, లాఅండ్ ఆర్డర్ కు సమస్య తెచ్చే విధంగా ప్రవర్తించడం తగదు. ప్రజాధనం దుర్వినియోగం అయింది అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మైలేజీ వస్తుందని నేను అనుకోను. అరెస్టుతో తెలుగుదేశం పార్టీకి మైలేజీ వస్తుందని అనుకుంటే ఏం చేయలేం. వాస్తవాలు అన్నవి ప్రజలకు తెలియాల్సి ఉంది. అవి తెలిశాక జ్యుడీషియరీ ముందు ఎవరికి వారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే ఎవరి సచ్ఛీలత ఎంతన్నది తేటతెల్లం అవుతుంది అని మంత్రి ధర్మాన అన్నారు. తాడేపల్లి: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడు నారా చంద్రబాబును అరెస్టు సుహాసిని ఏపీసీఐడీ ఆదివారం ఆయనను కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్బంగా ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా చంద్రబాబు దర్యాప్తు సంస్థలకు సహకరించాలని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అరెస్టే చేయకూడదు అని వాదిస్తే ఎట్లా ? ఇదేదో నిన్న అనుకుని ఈరోజు చేసిన అరెస్టు కాదు. ఈ కేసులో రెండేళ్ల కిందటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాక కొన్ని పేర్లు వస్తాయి. దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇంకొన్ని పేర్లు కూడా వీటికి అదనంగా వచ్చి కలుస్తాయి. ఈ కేసులో 37వ ముద్దాయిగా చంద్రబాబు నాయుడు పేరును చేర్చి, కోర్టు ముందు హాజరుపరిచారు. అసలు చంద్రబాబు నాయుడును అరెస్టే చేయకూడదు అని ఎవ్వరైనా వాదిస్తే అది ఎంత మాత్రం సబబు కాదు. రాజకీయ పార్టీలకు చెందిన వారు కానీ పౌరులు కానీ అరెస్టే చేయకూడదు అని వాదిస్తే ఎట్లా ?. మన వ్యవస్థలో,మన రాజ్యాంగ వ్యవస్థలో ఎవరికైనా మినహాయింపు ఉంటుందా? తప్పనిసరిగా అందరూ చట్టం ముందు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అందుకే దర్యాప్తు సంస్థ అరెస్టు చేస్తుందే తప్ప అరెస్టుకు సంబంధించి కారణాలను ముద్దాయితో సహా కోర్టు ముందు ఉంచుతుంది. అరెస్టు సక్రమమా ? అక్రమమా ? అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ఎవరికైనా ఈ దేశంలో ఇదే పద్ధతి. వ్యవస్థకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ నడుచుకుంది అని చెప్పడానికి ఏమీ లేదు కదా అన్నారు. ఏ ఒక్కరికో ఎందుకు మినహాయింపు ఇవ్వాలి ? ఇతను ఇంతకుముందు ప్రభుత్వాన్ని నడిపారు. ఆ సందర్భంలో ఆ ప్రభుత్వంలో భారీగా ధనం దుర్వినియోగం అయిందని రకరకాల సంస్థల నుంచి ఎస్టాబ్లిష్ అయింది. ఇతని పేరును ఛార్జిషీట్ లో 37వ ముద్దాయిగా చేర్చి కోర్టు ముందు హాజరు పరిచారు. దానిని మనం తప్పు పట్టేందుకు వీల్లేదని సభ్య సమాజానికి విన్నవిస్తున్నాను. దేశంలో ఇదేమైనా కొత్తా.. ఈయన ఒక్కరిపైనా ఇలా వ్యవహరించిందా వ్యవస్థా ? మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కోర్టు ముందు నిలబడలేదా? మన రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఆరోపణలకు సంబంధించి కోర్టు ముందు నిలబడలేదా? పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన జయలలిత కోర్టు ముందు నిలబడలేదా? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబడలేదా కోర్టు ముందు? పోనీ మేం అంతా నిలబడలేదా కోర్టు ముందు? ఎందుకు ఆయనకు ఒక్కరికే మినహాయింపు అవుతుంది? ఇందులో తెలిసీ,తెలియక ఆందోళన చేయాల్సిన అవసరం ఏముంది? దయచేసి అది కాదు మాట్లాడాల్సింది. మళ్లీ మాకు ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వండి అని అడిగినటువంటి వ్యక్తి.. తాము అధికారం ఇచ్చినప్పుడు ఇంతటి భారీ తప్పిదానికి పాల్పడ్డారు. అసలు ఇందులో వాస్తవాలు ఏమిటనేది ప్రజలు తెలియజేసేందుకు దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వాలి. అభియోగాలన్నవి తప్పు అని నిరూపించండి చాలు.. గతంలో ఇలాంటి ప్రభుత్వాలను నడిపినటువంటి వ్యక్తులు కూడా అమాయక ప్రజలను రెచ్చగొట్టి,వారిని ఉసిగొల్పి,దర్యాప్తు సాగనివ్వకుండా చేయడం,దర్యాప్తు అనేది ఓ మోటివ్ తో జరుగుతుందని అంటూ తప్పు దారి పట్టించడం ఇది కరెక్టు కాదన్నది నా అభిప్రాయం. మీకు నిజంగా దర్యాప్తులో పెట్టినటువంటి అంశాలు రుజువు చేసుకునేందుకు అవకాశం ఉంది. రుజువు చేసుకునే క్రమంలో కోర్టు పరిధిలో నమోదు అయిన అభియోగాలన్నవి తప్పు అని నిరూపించుకుంటే తప్పకుండా మీరు నిర్దోషిగా బయటపడతారు. ప్రజాధనం దుర్వినియోగం గురించి దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి ప్రజా జీవితంలో ఉండే ఇలాంటి వారు దర్యాప్తుకు సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. అసలు తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్నే సమాజం తప్పుపట్టాలని భావించే వ్యక్తిని నేను. మీరు ఏదో విధంగా తప్పించుకోవాలని చూడడం కరెక్టు కాదు. మనం ప్రమాణం చేసి వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయమని. దుర్వినియోగం జరిగిందని దర్యాప్తు సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది మేం చెప్పిందో.. పోలీసు వ్యవస్థ చెప్పిందో కాదు ఇందులో ఒక సంస్థ కాదు కదా ఎంత చెయిన్ ఇందులో ఉంది. ఇక్కడ అక్రమం జరిగిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అదే సమయాన అసలు మీరు చెబుతున్న సంస్థే లేదని ఎస్టాబ్లిష్ అయిందని చెబుతున్నాయి. ఆ మనీ అన్నది షెల్ కంపెనీలకు వెళ్లిపోయింది అని తేలిపోయింది. షెల్ కంపెనీలకు చేరిన మనీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి,మీకు చేరిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ దేశాన్ని విడిచి పారిపోయారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా యి కదా.! ఇందులో 37 మంది నిందితులు అయినా ఇది మేం చెప్పిందో. పోలీసు వ్యవస్థ చెప్పిందో కాదు కదా! కోర్టు నిర్ణయించాల్సింది. ఇలాంటి సందర్భాన అరెస్టును తప్పు పడితే ఎలా ? దర్యాప్తు చేస్తున్న సంస్థలకు ఉద్దేశాలను ఆపాదిస్తే ఎలా ? ఇలాంటి విషయాలను దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థలను అభినందించాలి కానీ, ఇంకొకరు ఇటువంటి పొరపాటు చేయకుండా నిరోధించే స్థితిలో సమాజం ఉండాలి కానీ, అసలు దర్యాప్తు సంస్థలను తప్పు పట్టడం, దీనికి మోటివ్స్ ను యాట్రిబ్యూట్ చేయడం,అసలు దర్యాప్తు చేసేందుకే వీల్లేదని అనడం భావ్యం కాదు. ఏంటి మనం ఎటు వెళ్లిపోతున్నాం మనం. ఇది కరెక్టు కాదు. పౌరుడిగా, మంత్రిగా నేను చెప్పేది ఒక్కటే.. నేను మాజీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. అనేక ఆధారాలతో మేం ఛార్జిషీటు పెట్టాం. రిమాండ్ రిపోర్టులు రాశాం. జ్యూడీషియరీ ముందుకు వచ్చారు. అది ప్రజలకు తెలిసిందే. అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. 37 మంది ఇందులో నిందితులుగా ఉన్నారు. మీరు 37 వ ముద్దాయిగా ఉన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు మీరు స్వచ్ఛందంగా దర్యాప్తునకు సహకరించాలి. దర్యాప్తు జరిగి ప్రజల ముందు,కోర్టులో మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. నిర్దోషిగా బయటకు రావాలి. మీరు తప్పించుకునేందుకు చూస్తే మచ్చ మిగిలిపోతుంది. జ్యుడీషియరీలో మీరు నిర్దోషిగా బయటకు వస్తే మీ సచ్ఛీలత అన్నది ఏంటన్నది తేటతెల్లం అవుతుంది. అసలు దర్యాప్తు జరగనివ్వకుండా చేస్తే దోషివన్న సంగతి కోర్టు కన్నా ముందు ప్రజలే నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో ఏది తప్పు ఏది ఒప్పు అన్నవి కోర్టు నిర్ణయిస్తుంది. కొన్నింటిని సమాజమే నిర్ణయిస్తుంది. దర్యాప్తు సంస్థను అభినందించాల్సిందే అనేక విషయాలు చూసిన వ్యక్తిగా,ఓ పౌరుడిగా,క్యాబినెట్ మినిస్టర్ గా చెబుతున్నది ఒక్కటే ఈ దేశంలో ఇదేం కొత్త కాదు. అనేక మంది పెద్దలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. శిక్ష అనుభవించారు. నిర్దోషులుగా బయటపడ్డారు. మీరు కూడా ఇన్ని సాక్షాధారాలు న్నటువంటి కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సహకరించి,వారికి కావాల్సినటువంటి సమాచారం ఇచ్చి,నేనేం చేయలేదు. నేను ఏ తప్పూ చేయలేదు,ప్రొసీజర్ అలా ఉంది అని నిరూపించుకునేందుకు అవకాశం ఉంది కనుక జ్యుడీషియరీ ముందు చంద్రబాబు తనని తాను నిరూపించుకోవాలని కోరుతున్నాను. మీరెవ్వరూ ఉద్రేక పడాల్సిన అవసరం లేదు సభ్య సమాజానికి నేను కోరుతున్నదేంటంటే..ఇటువంటి ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించి దర్యాప్తు చేపడుతున్న దర్యాప్తు సంస్థను అభినందించాలి. మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఈ సంస్థ ఇలాంటి పెద్ద విషయాన్ని కనుక్కొని అనేక స్థాయిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి,విదేశాలలో ఉన్న సంస్థకు ఇక్కడి నుంచి డబ్బు వెళ్లిందని చెబితే,ఆ సంస్థే మాకేం సంబంధం లేదని చెబితే,ఇలాంటి వాటిపై దబాయించడం ఏంటి ? అమాయక ప్రజలను రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం ఏంటి ? ఎవ్వరైనా శిక్షఅనుభవించాల్సిందే అందుకోసమే నేను సభ్య సమాజాన్ని కోరుతున్నది మీరెవ్వరూ ఉద్రేక పడాల్సిన అవసరం లేదు. దర్యాప్తులో భాగంగా సంబంధిత సంస్థలు లేదా అధికారులు లోతుగా వెళ్లిన తరువాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. మీరంతా తెలుసుకుంటారు. నిర్దోషి అయితే నిర్దోషిగా ఆయన బయటకు వస్తారు. లేదు దోషి అయితే ఈ దేశంలో ఒక్కొక్కరికీ ఒక్కో ఎగ్జమ్షన్ ఏమీ ఉండదు. ఎవ్వరైనా దోషిగా ఉంటే దోషి శిక్షను అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఇది నేను ముక్తాయిం పుగా చెప్పాలనుకుంటున్నాను. పౌరులంతా ఇది గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నానన్నారు మంత్రి ధర్మాన. ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘స్కిల్’ స్కాం: కోర్టులో ఎవరి వాదన ఏంటీ? -
లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి.. లేఖపై రాజకీయ దుమారం..!
బెంగళూరు: కర్ణాటకాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తమను నెలనెలా లంచం సమర్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఒత్తిడి చేస్తున్నారని సంబంధిత శాఖ డైరెక్టర్లు రాసిన లేఖ ఒకటి బయటపడింది. అది నకిలీదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రిపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి నెలకు రూ.8 లక్షల వరకు లంచం సమర్పించాలని ఆ శాఖకు చెందిన డైరెక్టర్లను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్‌కు బాధిత డైరెక్టర్లు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ ఒకటి బయటపడింది. ఇలా ఒత్తిడి చేస్తే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందంటూ బాధితులు గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరుగా ప్రభుత్వం మారిపోయిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఇది ప్రతిపక్షాల కుట్రగా పేర్కొన్నారు. ఆ లేఖ నకిలీదని గుర్తించినట్లు చెప్పారు. తన ప్రభుత్వంపై బురదజల్లడానికి బీజేపీ, జేడీఎస్‌లు ఆడిన నాటకని అన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
A1 రామోజీ, A2 రామోజీ శైలజకు నోటీసులు రండి మాట్లాడాలి..
-
మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థల్లో ఉద్యోగులను ప్రశ్నిస్తున్న CID
-
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: రెండో రోజు సీఐడీ విచారణ
-
ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్ఐఆర్
సాక్షి, విజయవాడ: ఫైబర్ గ్రిడ్ టెండర్లలో మరోసారి అవినీతి బయటపడింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ను న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. సీఐడీ దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్‌కు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టింది. రూ.330 కోట్ల తొలిదశ ఆఫ్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అవినీతి జరిగింది. (చదవండి: మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు) వేమూరి, టెరాసాఫ్ట్, అప్పటి అధికారులపై కేసు నమోదైంది. సుమారు రూ.2వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అంచనా. బ్లాక్ లిస్టులోని కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫోర్జరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. చదవండి: వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స -
సుప్రీంకోర్టు షరతులతో ఎల్లోమీడియాకు అడ్డుకట్ట
-
Raghu Rama Krishna Raju: ఏం గాయాలో తేల్చండి
సాక్షి, గుంటూరు, అమరావతి: తనను సీఐడీ పోలీసులు కొట్టారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మెజిస్ట్రేట్ కోర్టులో చెప్పడంతో, ఆ గాయాల నిగ్గు తేల్చేందుకు హైకోర్టు శనివారం మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరుస్తూ, ఓ సామాజికవర్గం, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతుండటంతో ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు శుక్రవారం సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో సీఐడీ పోలీసులు ఆయన్ను శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన తనను పోలీసులు కొట్టారని చెప్పడంతో, ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హెబియస్ కార్పస్ పిటిషన్‌గా పరిగణించాలని కోరారు. ఈ లేఖపై న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, పార్లమెంట్ సభ్యుడినే కొడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శనివారం రఘురామకృష్ణరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు. హైకోర్టు ఆయన గాయాలను పరిశీలించాలని కోరారు. గాయాల పరిశీలనకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, అందువల్ల తాము పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. గాయాల వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సూపరింటెండెంట్ సిఫారసు చేసే మరో డాక్టర్‌తో మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ పోలీసులు తక్షణమే రఘురామకృష్ణరాజును మెడికల్ బోర్డు ముందు హాజరు పరచాలంది. గాయాల పరిశీలన ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయాలని మెడికల్ బోర్డును ఆదేశించింది. అవన్నీ అసత్య ఆరోపణలు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ఈ విషయమై వివరణ కోరింది. ఆదినారాయణరావు ఆరోపణలను సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఐడీ పోలీసులు కొట్టారనడం శుద్ద అబద్ధమని చెప్పారు. ఉదయం హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగా ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అసత్య ఆరోపణలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. మధ్యాహ్నం ఎంపీ కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చారని, అప్పటి వరకు రఘురామ బాగానే ఉన్నారని, ఆ తర్వాతే సీఐడీ పోలీసులు కొట్టారన్న నాటకాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు. డాక్టర్ పరిశీలించాకే అతన్ని కోర్టు ముందు హాజరు పరిచామని, అప్పుడు ఎలాంటి గాయాలు లేవన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఆ గాయాలు తాజావని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించింది. రఘురామ భద్రతా సిబ్బందిని ఆస్పత్రిలోకి అనుమతించాల్సిన అవసరం లేదని చెప్పింది. అనంతరం ధర్మాసనం రిమాండ్ రిపోర్ట్ గురించి ఆరా తీసింది. అరెస్ట్‌కు స్పీకర్ అనుమతి లేదన్న కారణంతో రిమాండ్ రిపోర్ట్‌ను కింది కోర్టు తిరస్కరించిందని ఆదినారాయణరావు చెప్పారు. స్పీకర్‌కు ఇప్పటికే అరెస్ట్ గురించి సమాచారం ఇచ్చామని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తదుపరి విచారణను ఆదివారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. హైకోర్టులో చుక్కెదురు నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు బెయిల్ కోసం హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం మొదట కింది కోర్టులో పిటిషన్ వేసుకోకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడంపై అభ్యంతరం తెలిపింది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామకృష్ణరాజును వెంటనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలని సీఐడీ పోలీసులను మౌఖికంగా ఆదేశించారు. తగిన వైద్య సాయం కూడా అందించాలని సూచించారు. దీనికి ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ, ముందు కింది కోర్టుకెళ్లడం తప్పనిసరన్న నిబంధన ఏదీ లేదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయకుండా నేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించిన దాఖలా ఒక్కటి కూడా లేదన్నారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తే, హైకోర్టులో పిటిషన్ల వరద మొదలవుతుందని తెలిపారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఎంపీని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచలేదని, రిమాండ్ లేకుండా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 437, 438 ప్రకారం దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి ఎంత మాత్రం విచారణార్హత లేదని వివరించారు. ఈ సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను సుధాకర్‌రెడ్డి ఉదహరించారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఉత్తర్వులు జారీ చేస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు. కింది కోర్టు బెయిల్ రద్దు చేసినప్పుడు దానిని సవాలు చేస్తూ బెయిల్ కోసం దాఖలు చేసే వ్యాజ్యాలనే వెకేషన్ కోర్టులో విచారిస్తారన్నారు. ఇక్కడ చెప్పుకున్న విషయాలన్నింటినీ సెషన్స్ కోర్టులో చెప్పుకోవాలని తేల్చి చెబుతూ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 14 రోజుల రిమాండ్ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శనివారం సాయంత్రం సీఐడీ పోలీసులు ఆయన్ను గుంటూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల ఆరవ అదనపు, గుంటూరు సీబీసీఐడీ కోర్టు జడ్జి కె.అరుణ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వైద్య సాయం అవసరమని, పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణరాజు న్యాయమూర్తికి తెలిపారు. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, రమేష్ ఆసుపత్రిల్లో వైద్యులు పరీక్షించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎంపీకి ఉన్న ‘వై’ కేటగిరీ భద్రత నడుమే వైద్యుల పరీక్ష ప్రక్రియ కొనసాగాలని పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యం వైద్య పరీక్షల రిపోర్టును కోర్టుకు సమర్పించాలని సూచించారు. అంతకు ముందు హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయడంతో సీఐడీ కార్యాలయానికి వచ్చిన వైద్యుల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం రఘురామకృష్ణరాజును కోర్టుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో సాంకేతిక తప్పిదాలు ఉండటంతో వాటిని సరిచేయాలని కోర్టు సీఐడీ అధికారులకు సూచించింది. ఆ తప్పిదాలను సరిచేసి, తిరిగి సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. హావభావాలతో రక్తికట్టించిన రఘురామ సీఐడీ పోలీసుల అదుపులో ఉన్నంత వరకు ఎంపీ రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన ఆహారాన్ని, మందులను పోలీసులు లోనికి అనుమతించారు. శుక్రవారం రాత్రి నుంచి రిమాండ్‌కు తరలించేవరకు వైద్యుడిని ఆయనకు అందుబాటులో ఉంచారు. అయితే హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసిందని తెలిశాక సీఐడీ కోర్టులో ఒక్కసారిగా కొత్త డ్రామాకు రఘురామకృష్ణరాజు తెరతీశారని విమర్శలు వినిపిస్తున్నాయి. తనను పోలీసులు కొట్టారని హావభావాలతో డ్రామాను రక్తి కట్టించి కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు పూనుకున్నాడని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్‌లోనూ మార్పులు వచ్చాయి. కరుడుగట్టిన నేరస్తులపై సైతం పోలీసులు చేయి చేసుకోవడం లేదు. అలాంటిది పార్లమెంట్ సభ్యుడు అయిన తనను పోలీసులు కొట్టారని రఘురామ చెప్పడం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. తన కాళ్లపై లాఠీలతో కొట్టడం వల్ల కాళ్లు కందిపోయి, గాయాలయ్యాయని, నడవలేకపోతున్నానని ఎంపీ కోర్టులో తెలిపారు. సోరియాసిస్ వ్యాధితో బాధ పడుతున్నందున ఆయన అరికాళ్లలో ఎర్రగా బొబ్బలు వచ్చినట్లు తెలిసింది. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, ఆర్ఎంవో డాక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ డీఐజీ సునీల్‌కుమార్ నాయక్, గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి జీజీహెచ్‌ను సందర్శించారు. బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో కొత్త కథ.. సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామను కొట్టారనడం శుద్ద అబద్ధం. ఉదయం హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగా ఆయన ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చినప్పుడు కూడా రఘురామ బాగానే ఉన్నారు. ఆ తర్వాతే సీఐడీ పోలీసులు కొట్టారన్న నాటకాన్ని తెరపైకి తెచ్చారు. డాక్టర్ పరిశీలించాకే అతన్ని కోర్టు ముందు హాజరు పరిచాం. అప్పుడు ఎలాంటి గాయాలు లేవు. – అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి -
రఘురామకృష్ణరాజుకు రిమాండ్
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీబీసీఐడీ కోర్టు రిమాండ్‌ను విధించింది. ఈ నెల 28 వరకు రఘురామకృష్ణరాజు రిమాండ్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయనను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఈ సాయంత్రం రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. ఈ ఉదయం రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. రఘురామ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అదే సమయంలో రఘురామకృష్ణరాజుతో పాటు TV5, ABNలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా TV5, A3గా ABNలపై కేసులు ఫైల్ చేశారు. -
సీబీసీఐడీ స్పెషల్ కోర్టుకు ఎంపీ రఘురామకృష్ణరాజు
-
సీబీసీఐడీ స్పెషల్ కోర్టుకు ఎంపీ రఘురామ
సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. ఈ ఉదయం రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. రఘురామ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అదే సమయంలో రఘురామకృష్ణరాజుతో పాటు TV5, ABNలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా TV5, A3గా ABNలపై కేసులు ఫైల్ చేసింది. చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ -
నౌహీరా షేక్‌పై తొలి చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో స్కాములకు పాల్పడిన హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ సీఈవో చిత్తూరు జిల్లా వాసి నౌహీరా షేక్‌పై తొలి అభియోగపత్రం(చార్జిషీట్)ను ఎకనమికల్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు ముంబైలో దాఖలు చేశా రు. అక్కడ నమోదైన రూ.500 కోట్ల కుంభకోణంపై ఈఓడబ్ల్యూ దర్యాప్తు పూర్తిచేసి బుధవారం ముంబై కోర్టులో 3వేల పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసింది. డాక్టర్ నౌహీరాకు నో డాక్టరేట్ నౌహీరా అరెస్టు అయ్యే వరకూ డాక్టర్ నౌహీరాగానే చలామణి అయ్యారు. గత అక్టోబర్‌లో హైదరాబాద్ సెంట్రల్‌క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారులు ఈమెను తొలిసారిగా అరెస్టు చేసి విచారణ చేపట్టగా ఆ విచాణలో ఈమెకు డాక్టరేట్ లేదని తేల్చారు. తొలుత పీహెచ్డీ చేశానని చెప్పిన ఆ తర్వాత మాటమార్చి తన సేవలకు మెచ్చి దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ గౌరవ డాక్టరేట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈలోపు ముంబైలోనూ ఆమెపై కేసులు నమోదు కావడం, పీటీ వారంట్‌పై అక్కడకు తరలించడంతో తదుపరి విచారణను ఈఓడబ్ల్యూ చేపట్టింది. విచారణలో ఆమె తొమ్మిదో తరగతి వరకే చదివినట్లు తేలింది. కూరగాయల దుకాణంతో మొదలైన ప్రస్థానం చదువు మానేసిన నౌహీరా తన తల్లికి సహాయంగా కూరగాయల దుకాణం నడిపిన తర్వాత సొంతంగా పాత బట్టల క్రయవిక్రయాలు చేసింది. 1990ల్లో తొలిసారిగా మహిళలతో ఓ చిన్న గ్రూప్ ఏర్పాటు చేసిన ఆమె వివాహాది శుభకార్యాలకు బంగారం విక్రయించడం మొదలెట్టారు. 2008లో హైదరాబాద్‌కు మకాం మార్చి హీరా గ్రూప్ ఏర్పాటు చేయగా.. 2014 నాటికి ఈ గొడుగు కింద 17 సంస్థలు వచ్చి చేరాయి. వీటిలో నాలుగైదు సంస్థలకు ఆర్వీఐ సహా ఏ విభాగం నుంచీ అనుమతి లేకపోయినా డిపాజిట్లు సేకరించింది. సౌతాఫ్రికాలో బంగారు గనులు లీజు కు తీసుకున్నామని, పెట్టుబడులకు లాభాలే ఇస్తున్నానంటూ ప్రచారం చేసి అనేకమందిని ఆకర్షించిం ది. అయితే అదీ వాస్తవం కాదని, కొన్నాళ్లు ముంబైకి చెందిన ఇద్దరు వ్యాపారుల నుంచి బంగారం ఖరీదు చేసిందని, ఆపై అదీ మానేసినట్లు విచారణలో తేలింది. ముంబై కేంద్రంగా ఆమెతోపాటు ఆ గ్రూప్‌నకు 200 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు ఈఓడబ్ల్యూ గుర్తించింది. వీటితో 75 ఖాతాల్లో జరిగిన లావాదేవీలను పరిశీలించగా కేవలం రూ.17 కోట్లు లెక్కతేలింది. మిగిలిన మొత్తాన్ని ఎలా లావాదేవీలు చేశారనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. ఆస్తుల్ని గుర్తించిన పోలీసులు: సంస్థకు చెందిన రూ.40 కోట్ల విలువైన 6ఆస్తుల్ని గుర్తించిన ముంబై పోలీసులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో కోర్టు విచారణ ప్రారంభంకావాలంటే మరోసారి ఆమెను ముంబై కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారుల అదుపులో ఉంది. అక్కడి కేసుల విచారణ పూర్తయిన తర్వాత పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నౌహీరా స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని హీరా గ్రూప్ బాధితుల సంఘం అధ్యక్షుడు, హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం నేత షాబాజ్ అహ్మద్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. -
సూరీ హత్యకేసులో సీఐడీ కోర్టు తుది తీర్పు
సాక్షి, హైదరాబాద్: గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. సూరి హత్యకేసులో భానుకిరణ్‌ను దోషిగా తేలుస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. భానుకు సహకరించిన మన్మోహన్‌కు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా ఖరారు చేసింది. సూరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్బయ్య, హరిబాబు, వంశీ, వెంకటరమణలను నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది. 2011, జనవరి 3న సూరి హత్య జరిగింది. సూరీ అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్ మధుమోహన్ జూబ్లీహిల్స్ నుంచి సనత్‌నగర్ వెళ్తుండగా యూసుఫ్‌గూడలోని నవోదయ కాలనీ సమీపంలో సూరిపై భానుకిరణ్ పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపి హతమార్చాడనే ఆరోపణలపై కోర్టు విచారించింది. డ్రైవర్ మధు ఇచ్చిన ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 8 ఏళ్లపాటు ఎన్నో మలుపులు తిరిగిన ఈ హత్య కేసులో కోర్టు 117 మంది సాక్షులను విచారించింది. భాను కిరణ్‌పై పోలీసులు మూడు చార్జి షీట్లు నమోదు చేశారు. -
బాధితులకు న్యాయం చేస్తాం: అక్షయ గోల్డ్
హైదరాబాద్: బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఐడీ కోర్టుకు అక్షయ గోల్డ్ యాజమాన్యం తెలిపింది. ఎలాంటి న్యాయం చేస్తారో రాతపూర్వకంగా వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాలని కోర్టు సూచించింది. కాగా, డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు అక్షయ్ గోల్డ్ సంస్థ ఎక్కడ పెట్టుబడి పెట్టిందో తేల్చాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. బ్యాంకు నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30 వరకు వాయిదా వేసింది.