
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీకి విజ్ఞప్తులు చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని.. కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు.
ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని.. అలా చేస్తే దర్యాప్తునకు సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ మేరకు సీఐడీకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ‘మీ విచారణలో మాత్రం ఆయనకు ఇవేమీ గుర్తు రావు. కాబట్టి మీ ఎంక్వైరీలో నన్ను కూడా విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది’ అని ఆ వీడియోలో పొంగూరి ప్రియ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment