నవంబర్‌లో నిర్మాణాలు ప్రారంభం.. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిరి్మస్తాం. నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు, కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు, కాలువలపై రిజర్వాయర్లు నిరి్మస్తాం. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ
సాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పిందని, అయినప్పటికీ ఇక్కడే రాజధాని నిర్మిస్తామని, నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ఇటీవలి వరదల్లో దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా 2,017 చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పారు.
మంత్రి సోమవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, గుంటూరు జిల్లా తాడికొండలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందన్నారు. 2014–19 మధ్య 30 వేల మంది అమరావతిలో పనిచేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కృష్ణానది, బుడమేరు వరదలు విజయవాడలోని 32 డివిజన్లు, కొన్ని గ్రామాలను ముంచేసినా అమరావతికి ఏమీ కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేసిందని, కానీ కృష్ణా నది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షా కాలానికల్లా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను విస్తరిస్తామని తెలిపారు. అమరావతి సేఫ్ జోన్‌లో ఉందని, రాజధాని డిజైన్ సమయంలోనే వరద సమస్య లేకుండా కాల్వలు, రిజర్వాయర్లకు ప్రతిపాదనలు చేశామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment