సాక్షి, విజయవాడ: ఫైబర్ గ్రిడ్ టెండర్లలో మరోసారి అవినీతి బయటపడింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. సీఐడీ దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్‌కు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టింది. రూ.330 కోట్ల తొలిదశ ఆఫ్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అవినీతి జరిగింది. (చదవండి: మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు)
వేమూరి, టెరాసాఫ్ట్, అప్పటి అధికారులపై కేసు నమోదైంది. సుమారు రూ.2వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అంచనా. బ్లాక్ లిస్టులోని కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫోర్జరీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
చదవండి:
వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స
Comments
Please login to add a commentAdd a comment