
విద్యుద్దీపాల వెలుగులో వెంకన్న వైభవం
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండను ముస్తాబు చేస్తున్నారు. ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన గోపురంతోపాటు ఇతర ఆలయాలకు మెరుగులు దిద్దారు. మాడవీధులలో శోభాయమానంగా రంగవల్లులు వేయించారు. టీటీడీ గార్డెనింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ పుష్పాలతో ఆలయ ప్రాకారాలను అలంకరిస్తున్నారు. విద్యుద్దీపాల వెలుగులో తిరుగిరి కాంతులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఘాట్‌రోడ్‌కు మరమ్మతులు చేసి పిట్టగోడలకు రంగులు వేస్తున్నారు.
ఆలయం ఎదుట రంగవల్లిక..