వంట పదార్థాలను టీటీడీకి అందజేస్తున్న దాతలు
తిరుమల: తిరుమల శ్రీవారికి గో వ్యవసాయ ఆధారిత వంట దినుసులతో సంపూర్ణ నైవేద్యం సమర్పించేందుకు వీలుగా రూ.కోటి విలువైన వంట దినుసులు బుధవారం విరాళంగా అందాయి. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, మై హోమ్ గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు ఈ మేరకు హైదరాబాద్‌లోని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుంచి ఈ వంట దినుసులను పంపారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శివకుమార్ ఈ వస్తువులను తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆలయాధికారులకు అందజేశారు.
వీటిలో 6,200 కిలోల బియ్యం..1,500 కిలోల దేశీ ఆవు నెయ్యి, 600 కిలోల బెల్లం, 17 కిలోల బాదం, 315 కిలోల జీడిపప్పు, 21 కిలోల కిస్‌మిస్, 85 కిలోల ఆవాలు, 18 కిలోల మెంతులు, 20 కిలోల పసుపు, 25 కిలోల ఇంగువ, 380 కిలోల పెసరపప్పు, 200 కిలోల శనగ పప్పు, 265 కిలోల మినుములు, 350 కిలోల చింతపండు, 50 కిలోల రాక్ సాల్ట్, 375 కిలోల నువ్వుల నూనె, 7 కిలోల నువ్వులు, 10 కిలోల శొంఠి ఉన్నాయి.
చదవండి: డెయిరీ విభజనపై ఇరు రాష్ట్రాలకు నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment