
సాక్షి, తిరుపతి: నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని శనివారం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ పూజారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. తర్వాత ఆలయం ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు బుద్ధి చేప్పినా టీడీపీ నేత ఆయ్యన్న పాత్రుడికి సిగ్గురాలేదని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అండగా నిలిచారని ఆమె గుర్తుచేశారు.
చదవండి: Sakshi Excellence Awards: ఘనంగా 'సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల కార్యక్రమం
Comments
Please login to add a commentAdd a comment