Srivari brahmotsavams
-
ఏప్రిల్ 24 నుంచి తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 24 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ కారణంగా రెండోరోజు నిర్వహించే స్వర్ణ రథోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. వసంత రుతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవం’అని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించి వివిధ ఫలాలను స్వామికి నివేదిస్తారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లు ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు నిలుపుదల దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు స్వచ్ఛందంగా పాల్గొనే శ్రీవారి సేవను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి సేవకు వచ్చే వలంటీర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. తదుపరి శ్రీవారి సేవ ప్రారంభమయ్యే తేదీలను ముందుగానే తెలియజేస్తామని తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో శ్రీవారి సేవకు రాదలచిన వలంటీర్లు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక్కడ చదవండి: హన్మంతుని జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ భక్తులకు మరింత సులభతరంగా ‘తిరుమల’ గదులు -
తిరుమలకు సీఎం జగన్
-
బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండను ముస్తాబు చేస్తున్నారు. ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన గోపురంతోపాటు ఇతర ఆలయాలకు మెరుగులు దిద్దారు. మాడవీధులలో శోభాయమానంగా రంగవల్లులు వేయించారు. టీటీడీ గార్డెనింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ పుష్పాలతో ఆలయ ప్రాకారాలను అలంకరిస్తున్నారు. విద్యుద్దీపాల వెలుగులో తిరుగిరి కాంతులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఘాట్రోడ్కు మరమ్మతులు చేసి పిట్టగోడలకు రంగులు వేస్తున్నారు. ఆలయం ఎదుట రంగవల్లిక.. -
వైభవంగా రథోత్సవం.. రేపు శ్రీవారికి చక్రస్నానం
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో 8వ రోజు సోమవారం ఉదయం 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం శ్రీవారు మల్లయప్పస్వామిగా అలంకృతుడై బ్రహ్మారధం పై మాడ వీధుల్లో ఊరేగారు. స్వామిని కనులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో అందరినీ అలరింపజేశారు. రథాన్ని లాగే క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. రథం తిరుగుతున్న సమయంలో ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించారు. రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు సంయమనం పాటించి సహకరించాలని టీటీడీ ఈవో సాంబశివరావు కోరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పుష్కరిణి వద్ద ఈతగాళ్లను, బోటను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు.