
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించింది. కోవిడ్ వ్యాక్సిన్ రవాణా, భద్రపరచడంపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. స్టోరేజ్ పాయింట్‌లో 15 లక్షల డోసులు నిల్వ చేసే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.(చదవండి: గుడ్ న్యూస్ : ఈ నెల 16 నుంచే వ్యాక్సినేషన్)
గన్నవరం సెంటర్ నుంచే 4 రీజనల్ సెంటర్లు, జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని, కర్నూలు, కడప, గుంటూరు, విశాఖలో ప్రాంతీయ వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. గన్నవరంలోని రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్‌లో ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం పరిశీలించారు. అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ రవాణాకు 19 వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనంలో 2 - 8 డిగ్రీల మధ్యలో వ్యాక్సిన్ భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ల భద్రతకు 36,381 వ్యాక్సిన్ కెరియర్స్, 3,108 కోల్డ్ బాక్స్‌లు1,50,700 ఐస్ ప్యాక్స్ అవసరమని కేంద్రానికి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.(చదవండి: అనసూయ ట్విట్.. మెగా ఫ్యామిలీలో కలకలం!)
Comments
Please login to add a commentAdd a comment