నార్కట్‌పల్లి(నకిరేకల్): బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌరల్ ఉప్పల్ ఆదేశించారు. గట్టుపైన, కింద ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ శ్రీనివాసరావు, జేసీ నారాయణరెడ్డితో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ అసంపూర్తి పనులను త్వరలో పూర్తిచేయాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు గట్టుపైకి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పా టు చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 58 సీసీ కెమెరాలు, 3 కంట్రోల్ రూంలు, షీటీమ్, అగ్నిమాపక కేంద్రం, ఆరోగ్య సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్ పర్యవేక్షణలో సిబ్బంది విధులు నిర్వహిం చాలన్నారు.
అనంతరం జిల్లా జడ్జి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చిన ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలును వివరించాలని అధికారులకు సూచించారు. ప్రొజెక్టర్ ద్వారా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఖీమ్యానాయక్, జెడ్పీసీఈఓ హనుమానాయక్, పీడీ రాజ్‌కుమార్, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చైర్మన్ నల్ల వెంకన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, సీఐ క్యాస్ట్రోరెడ్డి ఎంపీడీఓ గుర్రం సురేశ్, ఈఓ అంజనారెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సర్పంచ్ మల్గ రమణాబాలకృష్ణ, ఎంపీటీసీ అనితవెంకన్న, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి ఉన్నారు.
జాన్‌పహాడ్ ఉర్సు ఏర్పాట్ల పరిశీలన
నేరేడుచర్ల(హుజూర్‌నగర్): ఈ నెల 25,26,27 తేదీలలో నిర్వహించనున్న జాన్‌పహాడ్ ఉర్సు ఏర్పాట్లను శుక్రవారం హుజుర్‌నగర్ సీఐ నర్సింహారెడ్డి, మిర్యాలగూడ డిపో మేనేజర్ సుధాకర్‌రావు దర్గా పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. వారి వెంట దర్గా కాంట్రాక్టర్ సుబ్బారావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ ఫయాజ్, నాయకులు శ్రీను, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment