సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు  | CM YS Jagan Visiting Arrangements In chittoor | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు 

Published Sun, Jan 5 2020 9:51 AM | Last Updated on Sun, Jan 5 2020 9:52 AM

CM YS Jagan Visiting Arrangements In chittoor - Sakshi

హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు 

సాక్షి, చిత్తూరు: జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభా నికి ఈ నెల 9వ తేదీన చిత్తూరుకు విచ్చేయనున్న ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లు పక్కా గా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త, చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ మా ర్కండేయులు, జేసీ–2 చంద్రమౌళి, చిత్తూరు ఆర్డీఓ రేణుక, వైఎస్సార్‌ కడప జిల్లా ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి, రాష్ట్ర వి ద్యాశాఖ మధ్యాహ్న భోజన పథకం విభాగం జేడీ రవీంద్రారెడ్డి ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు.

9వ తేదీన అమ్మ ఒడి పథకం ప్రారంభం, బహిరంగ సభకు చిత్తూరులోని పీవీకేఎన్‌ మైదానాన్ని ఖరారు చేశారు. మెసానికల్‌ మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భా గంగా పీవీకేఎన్‌  మైదానంలో జరిగే కార్యక్రమంలో దాదా పు 25 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు అదనంగా సభావేదికను ఏర్పాటు చేయనున్నారు. రెండు గంటల పాటు జరిగే సీఎం పర్యటన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది.  

ప్రత్యేకంగా స్టాళ్లు 
సభావేదిక వద్ద పలు సంక్షేమ పథకాలకు సంబంధించి స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.  నాడు–నేడు పథకం,  మధ్యాహ్న¿ోజనం,  అమ్మఒడి,  వైఎస్సార్‌ కంటివెలుగు,  ఇంగ్లిషు ల్యాబ్‌ స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ స్టాళ్ల ఏర్పాట్లను విద్యాశాఖ అధికారు లు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులను కార్యక్రమానికి తీసుకొచ్చే లా చర్యలు తీసుకుంటున్నారు. ఉప రవాణాశాఖాధికారు లు విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా బస్సుల ను ఏర్పాటు చేస్తున్నారు. గుర్తించిన గ్రామాల్లో బస్సులను ట్యాగ్‌ చేసి వారిని క్షేమంగా తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అల్పాçహారం అందజేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో విద్యార్థుల పర్యవేక్షణకు సంరక్షకులుగా టీ చర్లను, పీడీ, పీఈటీలను నియమిస్తున్నారు. విద్యార్థులు యూనిఫామ్‌లో రావాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసే ప్రజాప్రతినిధులకు జ్ఞాపికలు అందజేయనున్నారు.  

అధికారులు సమన్వయంతో పనిచేయాలి 
అధికారులంతా సమన్వ యంతో పనిచేసి, ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చే స్తున్నాం. బందోబస్తును క ట్టుదిట్టం చేస్తున్నాం. హెలీప్యాడ్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావిస్తున్న జగనన్న అమ్మఒడి పథకం చిత్తూరులో ప్రారంభించడం సంతోషకరం. ఈ పర్యటనను పక్కాగా నిర్వహించి విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.  
– నారాయణ భరత్‌ గుప్త, జిల్లా కలెక్టర్‌  ఎంఈఓ,

హెచ్‌ఎంలతో సమీక్ష నిర్వహించాం 
సీఎం పర్యటనపై జిల్లా లోని 66 మండలాల ఎంఈఓలు, గుర్తించిన ఆయా పాఠశాలల హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించాం. ముందస్తు ప్ర ణాళికలను సిద్ధం చేసు కుని ముందుకెళ్తున్నాం. క లెక్టర్‌ సూచనల మేరకు విభాగాల వారీగా బృందాలను ఏర్పాటుచేశాం. ఆ టీంలు చేయాల్సిన విధివిధానాలపై సూచనలు ఇచ్చాం. పర్యవేక్షణ, విద్యార్థులకు అల్పాహారం ఏర్పాట్లు చేస్తున్నాం.  
– వెంకటకృష్ణారెడ్డి, ఆర్‌జేడీ, వైఎస్సార్‌ కడప జిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement