Corona Vaccine Distribution Arrangements In Hyderabad | Covid 19 Vaccine Telangana - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కరోనా వాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు

Published Tue, Dec 15 2020 1:04 PM | Last Updated on Tue, Dec 15 2020 4:42 PM

Coronavirus Vaccine Distribution Arrangements In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జనవరి రెండో వారంలోగా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు వాక్సిన్‌ స్టోరేజీ, పంపిణీ ప్రక్రియ ముందే సిద్ధం చేసి ఉంచాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి తొలి విడతగా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించింది.  

  • వ్యాక్సిన్‌ పంపిణీకి ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఆయాల నుంచి డాక్టర్ల వరకు అందరి వివరాలను ఇప్పటికే సేకరించింది.  
  • సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి వ్యాక్సిన్‌ను చుట్టల్‌బస్తీ, బేగంబజార్, హరాజ్‌పెంట, శ్రీరాంనగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోని స్టోరేజ్‌ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి నేరుగా అవసరమైన వారి చెంతకు చేరుస్తారు.  
  • ఇప్పటికే కోల్డ్‌స్టోరేజీ బాక్సులు కూడా నగరానికి చేరుకున్నాయి. సాధారణ వ్యాక్సిన్‌ మాదిరే కోవిడ్‌ వాక్సిన్‌ను కూడా 2 నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయనున్నారు.  
  • తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది 2.67 లక్షల మందిని గుర్తించగా...వీరిలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 76,804 మంది, రంగారెడ్డి జిల్లాలో 25,211 మంది, మేడ్చల్‌ జిల్లాలో 10,050 మందిని గుర్తించారు.  
  • గ్రేటర్‌ పరిధిలో 42 శాతం మంది ఉండగా, వీరిలో ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 28 శాతం ఉన్నట్లు అంచనా.   
  • రెగ్యులర్‌ వాక్సిన్లకు ఆటంకం కలగకుండా.. కోవిడ్‌ వాక్సినేషన్, పనితీరుపై జిల్లా స్థాయి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి నేటి నుంచి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది.  
  • డీఎంహెచ్‌ఓ, డీఐఓ, సహా పలువురు మెడికల్‌ ఆఫీసర్లకు తొలి విడత శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత వీరు కంప్యూటర్‌ ఆపరేటర్లు, పీహెచ్‌సీలో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వనున్నారు.  
  • పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్‌ వాక్సినేషన్‌కు ఇబ్బంది లేకుండా బుధ, శనివారాలు మినహాయించి మిగిలిన రోజుల్లో కోవిడ్‌ వాక్సిన్‌ వేయనున్నారు. 
  • ఒక్కో ఏఎన్‌ఎం రోజుకు ఎంపిక చేసిన ప్రాంతంలో వంద మందికి కరోనా టీకా వేయాల్సి ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement