జగన్ సభా ఏర్పాట్లపై సమావేశం
నరసరావుపేట రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16వ తేదీన నరసరావుపేట నిర్వహించనున్న బహిరంగ సభపై పార్టీ జిల్లా నాయకులు విస్త్రృత చర్చలు జరిపారు. యువ నాయకుడు కాసు మహేష్‌రెడ్డి ఈ సభలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నారు.నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహంలో శుక్రవారం రాత్రి పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, కాసు మహేష్‌రెడ్డి, కావటి మనోహార్‌నాయుడు, మిట్టపల్లి రమేష్‌బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల తర్వాత నరసరావుపేట నియోజకవర్గానికి మొదటిసారిగా జగన్ రానున్నడంతో సభను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభా ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.