మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి విపక్షాల కంటికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కొడాలి నాని.. మ్యానిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్న గొప్ప సీఎం జగన్ అని కొనియాడారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌పై మండిపడ్డారు నాని. ‘ మహానాడును చంద్రబాబు నవ్వులు పాలు చేశాడు. టీడీపీ నేతలకు చిన్న కర్మకు, పెద్ద కర్మకు తేడా తెలియదు. పనికిరాని దద్దమ్మ చంద్రబాబు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారు. లోకేష్ గెటప్‌కు సరిగ్గా సరిపోయే పేరు సిద్ధప్ప’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment