
ప్లీనరీ వేదికపై పాట పాడుతున్న మంత్రి సీదిరి
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కమిటీ కన్వీనర్ వంగపండు ఉష ఆధ్వర్యంలో 15 మంది కళాకారులు జానపద నృత్యాలు, గీతాలతో అలరించారు.
చదవండి: అంతులేని అభిమానం.. తీవ్ర అనారోగ్యంలోనూ ప్లీనరీకి..
నవరత్నాలు, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బాణీలతో కూర్చిన గేయాలకు చిందేసి ఆడుతూ ప్లీనరీకి వచ్చిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సినీనటుడు జోగినాయుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం కాగా, ప్రజాప్రతినిధులు సైతం పాలుపంచుకున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సీఎంని కీర్తిస్తూ పాటపాడారు.
వేదికపై ఆలపిస్తున్న వంగపండు ఉష, తదితరులు
Comments
Please login to add a commentAdd a comment