ప్లీనరీ ఏర్పాట్లపై మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి, చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు గీటురాయిగా ప్లీనరీ నిలుస్తుందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాలతో, పారదర్శక విధానాలతో సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలన అందిస్తుండటం వల్ల ప్లీనరీ ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతుందన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తుంటే ప్లీనరీ భారీ ఎత్తున విజయవంతమవడం ఖాయమని స్పష్టం చేశారు. ఇది చూసి తాళలేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తారని దెప్పిపొడిచారు. విజయసాయి రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
► ప్లీనరీకి ఒక క్రమపద్ధతిలో ఆహ్వానాలు పంపాం. పార్టీ వ్యవస్థలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
► జూలై 8వ తేదీ మొదటి రోజు సుమారు 1.50 లక్షల మంది.. రెండో రోజు 4 లక్షల మంది హాజ రవుతారని అంచనా వేస్తున్నాం.
► 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు తెల్లారిలేస్తే మాపై విమర్శలు చేస్తూ బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేయాలనే దురుద్దేశంతో కుటిల ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. నిజానికి ఒక్క స్కూల్ మూసి వేయకున్నా 8 వేల గ్రామాల్లో స్కూళ్లను మూసేశారని మదనపల్లెలో పచ్చి అబద్ధం చెప్పారు.
► విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, సుపరిపాలన అంశాల్లో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉంది.
తండ్రీకొడుకులు తాగేది ఏ బ్రాండ్?
► చంద్రబాబు ప్రతిరోజు ఒక అబద్ధాన్ని తీసుకుని, దాన్నే నిజం అని పదే పదే ప్రజల మెదళ్లలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్ర భుత్వ హయాంలో ఒక్క డిస్టలరీకి కొత్తగా అను మతి ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ లేని 254 కొ త్త లిక్కర్ బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చంద్ర బాబే. అలాంటి ఆయన మద్యంలో కెమికల్స్ ఉన్నాయని అబద్ధాలాడుతున్నారు. బాబు, లోకేష్.. ఏ బ్రాండు తాగుతున్నారో చెప్పాలి.
► ప్లీనరీకి మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్, పార్టీ ప్రజాప్రతినిధులంతా హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై తొలి రోజు తీర్మానం ప్రతిపాదిస్తాం. మరుసటి రోజు ఎన్నిక జరుగుతుంది.
► పార్టీని మరింత పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ కమిటీల నియా మకానికి సంబంధించి శుక్రవారం ప్రకటన చేయబోతున్నారు. దీంట్లో ప్రతి స్థాయిలో కూడా ఎలా నియామకాలు జరగాలనేది దిశానిర్దేశం చేస్తారు. తద్వారా రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతాం.
చేసిన మంచి పనులన్నీ చెబుతాం
► మేం చేసిన మంచి పనులన్నీ ప్లీనరీలో చెబుతాం. వక్తలందరూ మాట్లాడతారు. తీర్మానాలు ఆమోదిస్తాం.
► ప్లీనరీలో పెట్టే భోజనాల విషయంలో టీడీపీ, చంద్రబాబు అసంబద్ధ ఆరోపణ లు చేస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యే వారికి 25 రకాల శాఖాహార, మాంసాహార వంట కాలతో భోజన ఏర్పాట్లు చేశాం.
► మేమేదో ప్లీనరీలో పంది మాంసం పెడుతున్నామని చంద్రబాబు దుష్ప్రచా రం చేస్తున్నారు. బహుశా చంద్రబాబుకు అది తిని తిని అలవాటు అయిందేమో! మా ప్లీనరీ మెనూలో దాని ప్రస్తావనే లేదు.
Comments
Please login to add a commentAdd a comment