Minister Buggana Rajendranath Comments On Chandrababu Details Inside - Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు సీఎంగా ఉంటే కరోనా వచ్చేది కాదంట..’

Published Fri, Jul 1 2022 4:02 PM | Last Updated on Fri, Jul 1 2022 4:25 PM

Minister Buggana Rajendranath Comments On Chandrababu - Sakshi

సాక్షి, కర్నూలు: చంద్రబాబు పాలనంతా అబద్ధాలమయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని.. కరోనా కష్టకాలంలో కూడా సుపరిపాలన అందించారన్నారు. సీఎం జగన్‌ పాలనపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, టీడీపీ నేతలు బాదుడే బాదుడు అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు మూడేళ్లలో 25 శాతం పెరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.
చదవండి: ఆ లేఖ చెత్తబుట్టకు చేరుతుంది: మంత్రి అంబటి

‘‘చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యం. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని, ఆలూరులో జింకల పార్కు అంటూ మోసం చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడతాడో అర్థం కాదు.. తాను సీఎంగా ఉంటే కరోనా వచ్చేది కాదని చెబుతున్నారు’’ అంటూ మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఓ స్కీం తీసుకురాబోతుంది. వారికి వచ్చే రోజుల్లో మంచి రోజులు వస్తాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement