గన్నవరం: పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవటంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. చత్తీస్‌గడ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రావల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఢిల్లీ, హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులను పొగమంచు కమ్మెసింది. దీంతో పలు విమానాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల వాతావరణం అనుకూలించికపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు.
ఉదయం 07:35 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఉదయం 8:05 గంటలకు రియాద్ నుంచి రావలసిన విమానం, ఉదయం 9:10 గంటలకు జెడ్డా నుండి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలు బెంగళూరు, నాగపూర్‌కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది అయ్యప్ప భక్తుల ఆందోళన
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఉదయం 9:40కి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం పొగ మంచు కారణంగా 11 గంటలకు వెళ్లనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. 11 గంటలు దాటిన విమానాన్ని కొచ్చికి వెళ్లేందుకు సుముఖత చూపకపోవడంతో ఎయిర్‌పోర్టులో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. రాత్రి 10:40కి భక్తులకు దర్శనం ఉండడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment