
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్‌ను వారిని కలవనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ కార్లలో ఉన్న కార్యకర్తలను సైతం దించివేయించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారుని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టు ప్రధాన గేటు వద్ద వెల్లంపల్లి భైఠాయించారు. వెల్లంపల్లి నిరసనతో దిగివచ్చిన పోలీసులు.. ఆయన కారుని ఎయిర్ పోర్ట్ లోపలికి అనుమతించారు. పోలీసుల తీరుపై వైస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు ఆంక్షలు
బెంగళూరు నుంచి కొద్దిసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న @ysjagan గారు. స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్కి వస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.
గతంలో ఎన్నడూ లేనట్లుగా ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు,… pic.twitter.com/1UnrdPCeMB— YSR Congress Party (@YSRCParty) August 6, 2024