
సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం విజయవాడతో పాటు గుంటూరులో జరిగిన పలు వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి విమానంలో నేరుగా గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్ ...విజయవాడలో జరిగిన సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో గుంటూరు చేరుకున్నారు. వైఎస్‌ఆర్ సీపీ నేత లాల్‌పురం రాము కుమారుడు భానుప్రసన్న వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కాంగ్రెస్ నేత వణుకురి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె పెళ్లికి విచ్చేసి, వధూవరులను ఆశీస్సులు అందించారు. కాగా అంతకు ముందు వైఎస్ జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.