
సాక్షి, గన్నవరం : ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌ను సాధించడంతో తన ఎన్నోఏళ్ల కల నేరవేరిందని కోనేరు హంపి ఆనందం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ 28,29.30 తేదిల్లో రష్యాలోని మాస్కోలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఈ సందర్భంగా స్వదేశానికి చేరుకున్న హంపిని బుధవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులతో పాటు, ఆమె కుటుంబ సభ్యులు శాలువా, బొకేలతో ఘన స్వాగతం పలికారు. హంపి మాట్లాడుతూ.. తన ఎన్నో ఏళ్ల కళ ఈసారి నెరవేరిందని, ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌ను సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందివ్వడంతోనే తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment