
ఏపీకి మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి.
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీకి మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకా డోసులను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. గన్నవరం నుంచి ఏపీలోని 13 జిల్లాలకు టీకాలను వైద్యాధికారులు సరఫరా చేయనున్నారు.