
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరో 5.76 లక్షల కోవిడ్ టీకా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పుణె నుంచి కోవిడ్ వ్యాక్సిన్లు గన్నవరం చేరుకోగా, వీటిని గన్నవరంలోని కోవిడ్ టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించనున్నారు. అనంతరం వైద్యశాఖ ఆదేశాలతో మేరకు జిల్లాలకు టీకా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు.