సాక్షి, కృష్ణా: బ్యాటరీ కార్లు వాడటం వల్ల కాలుష్య స్థాయి తగ్గుతుందని ఎంపీ బాలశౌరి అన్నారు. సోమవారం ఆయన గన్నవరం విమానాశ్రయంలో కాలుష్య రహిత బ్యాటరీ కార్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గన్నవరం విమానాశ్రయంలో బ్యాటరీ కార్లను ప్రారంభించామన్నారు. ఇక ఈ ఎయిర్‌పోర్టు నుంచి వారానికి రెండు రోజులు దుబాయ్ సర్వీసులు నడపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎయిర్ ఇండియా అధికారులను కోరామని తెలిపారు.
త్వరలోనే శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాలకు సర్వీసలు
గన్నవరం విమానాశ్రయం నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాలకు వారానికి రెండు రోజులు సర్వీసులు నడపాలని జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో సంస్థలను కోరామన్నారు. ఇక్కడి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం దృష్ట్యా ఆయా సంస్థలు సానుకూలంగా స్పందించాయన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయా దేశాలకు సర్వీసులు ప్రారంభం కానున్నాయని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ మధుసూదనరావు పాల్గొన్నారు.
చదవండి: ఏపీలో ‘కాంకర్’ పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment