Battery cars
-
నిమ్స్‌లో బ్యాటరీ కార్లు
లక్డీకాపూల్ : నిమ్స్‌లో చికిత్సకు వచ్చే రోగుల సౌకర్యార్థం బ్యాటరీ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద కార్లను ఏర్పాటు చేయనున్నారు. నిమ్స్ లోపలికి ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని నియంత్రించే క్రమంలో బ్యాటరీ కార్లను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఆటోలు, క్యాబ్‌లను నియంత్రించేందుకు యాజమాన్యం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఆస్పత్రి ప్రాంగణంలో జటిలంగా తయారైన ట్రాఫిక్ సమస్యను సైతం చక్కదిద్దే క్రమంలో వినూత్న చర్యలకు ప్రణాళికలను సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా జూన్ మొదటి వారంలో అందుబాటులో రానున్న బ్యాటరీ కార్లు రోగుల అవసరాలను తీర్చే విధంగా దోహదపడతాయి. ఈ కార్ల సేవలు నగరంలో ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రి రంగంలో తొలిసారిగా నిమ్స్ ప్రవేశపెట్టనుంది. ఆంధ్రా బ్యాంకు అయిదు బ్యాటరీ కార్లను సమకూర్చనుంది. కొంత మంది దాతలు ఈ కార్లను సమకూర్చేందుకు ముందుకు వస్తున్నారని, ఇప్పటికి కొన్ని సేవలకు సిద్ధంగా ఉన్నాయని నిమ్స్ ఇన్‌చార్జిర్జి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, నిమ్స్ ఏపీఆర్ సత్యాగౌడ్ తెలిపారు. ఎర్రమంజిల్ కాలనీలో రవీంద్రనాథ్ ఠాకూర్ స్కూల్ కొనసాగిన ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 2 వేల పడకల బహుళ అంతస్తుల సముదాయానికి వచ్చే నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేస్తారని చెప్పారు. -
ఈవీ..‘పొగ’బెట్టవు
సాక్షి ప్రతినిధి, అమరావతి: ప్రపంచం కాలుష్య రహిత వాహనాల వైపు చూస్తోంది. ప్రస్తుతం వాడుతున్న పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలూ కార్యాచరణలోకి దిగాయి. దీంతో కాలుష్య రహిత వాహనాల తయారీపై కంపెనీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీని ప్రారంభించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక బ్యాటరీల మేళవింపుతో ఈ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. భారత దేశంలోనూ ఇప్పుడిప్పుడే ఈ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులూ వస్తున్నాయి. ముంబైలో బ్యాటరీతో నడిచే డబుల్ డెక్కర్ బస్సును ఇటీవలే ప్రవేశపెట్టారు. దేశంలో బ్యాటరీ కార్ల తయారీ కూడా మొదలైంది. ఈవీల ధరలు ఎక్కువగా ఉండటం మార్కెట్లో పెద్ద సవాలుగా మారింది. అయితే, వీటి వినియోగంతో కాలుష్యంతో పాటు ఇంధన వ్యయం కూడా తగ్గుతుంది. విద్యుత్ వాహనాలపట్ల ప్రజలు ఆకర్షితులు కావడానికి ఇదే ప్రధాన కారణం. విద్యుత్ కార్లకు ఉన్న డిమాండ్‌ను, అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశంలో ప్రధాన కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. టాటా కంపెనీ ఇప్పటికే విద్యుత్ కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2024–26 మధ్య ఐదు కొత్త మోడల్స్ కార్లు తెస్తామని మహీంద్రా ప్రకటించింది. ఆన్లైన్ ట్యాక్సీ వ్యాపారం చేసే ‘ఓలా’, ఇప్పటికే విద్యుత్ స్కూటర్లు తయారుచేస్తోంది. రెండేళ్లలో విద్యుత్ కార్లు కూడా తెస్తామని ప్రకటించింది. దేశంలో కార్ల తయారీలో నంబర్–1 స్థానంలో ఉన్న మారుతి కూడా విద్యుత్ కారు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ కంపెనీలవన్నీ లిథియం అయాన్ బ్యాటరీ ఆధారిత వాహనాలే. విద్యుత్ వాహనాల్లో ఇది విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం. ఈవీల వినియోగంలో చైనా టాప్ ప్రయోగ దశ దాటి విద్యుత్ వాహనాలను పెద్ద సంఖ్యలో తయారుచేయడం 2010లో ప్రారంభమైంది. ‘ఈవీ’ల వాణిజ్య ఉత్పత్తి తొలుత ‘నిసాన్’ ప్రారంభించింది. నిసాన్ లీఫ్ తొలి ఈవీ వాహనం. 2012లో ‘టెస్లా మోడల్ ఎస్’ రోడ్డెక్కడంతో మిగతా సంస్థలూ వీటి తయారీ మీద దృష్టి పెట్టాయి. 2011లో ప్రపంచవ్యాప్తంగా 55 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. పదేళ్ల తర్వాత వీటి సంఖ్య 70 లక్షలకు చేరింది. అందులో సగం వాటా చైనాది. ఈవీల వినియోగంలో అమెరికా, ఐరోపా దేశాలను మించి చైనా దూసుకుపోతోంది. భారత్‌లో సగం ద్విచక్ర వాహనాలు 2021లో దేశంలో 3.29 లక్షల విద్యుత్ వాహనాలు రోడ్డెక్కితే, అందులో 48 శాతం ద్విచక్ర వాహనాలే. మరో 45 శాతం ఆటో రిక్షాలు ఉన్నాయి. కార్లు 4 శాతం ఉండగా, ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర వాహనాల వాటా 3 శాతం. ప్రజా, సరకు రవాణా వాహనాల సంఖ్య పెరిగితేనే కాలుష్యం తగ్గుదల ఎక్కువగా ఉంటుంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల దిగుమతులు తగ్గుతాయి. ఇటు పర్యావరణ పరిరక్షణకు, అటు విదేశీమాదక ద్రవ్యం మిగులుకు ఇది దోహదం చేస్తుంది. ధరలు ఎక్కువగా ఉండటమే అసలు సమస్య విద్యుత్ వాహనాల ధరలు సాధారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువ. ద్విచక్ర వాహనాల ధరలు మరీ ఎక్కువగా లేకపోవడం, ఇంధన వ్యయం తక్కువగా ఉండటం వల్లే టూవీలర్ల విక్రయాలు పెరుగుతున్నాయి. లోస్పీడ్ ఆటో రిక్షాల ధరలూ మరీ ఎక్కువగా లేవు. ఈవీ కార్లు, బస్సుల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. స్థానికంగా తయారయిన వాహనాల మీద 28 శాతం జీఎస్టీ ఉండగా, విద్యుత్ వాహనాలకు 5 శాతం వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈవీల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. బ్యాటరీ ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. దేశంలో బ్యాటరీ తయారీకి విదేశీ కంపెనీల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అరువు తెచ్చుకోవాలి. మన సొంత టెక్నాలజీతో బ్యాటరీలు తయారు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ తయారీలో సవాళ్లు ఎన్నో.. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ప్రధానంగా లిథియం, మాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్ (రాగి), అల్యూమినియం, గ్రాఫైట్, టైటానియం అనే 8 ఖనిజాలు అవసరం. మన దేశంలో మాంగనీస్, నికెల్, కాపర్, అల్యూమినియం నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. గ్రాఫైట్ నిల్వలూ ఉన్నప్పటికీ, ముడి ఖనిజం నుంచి బ్యాటరీ తయారీకి అవసరమయ్యే నాణ్యమైన గ్రాఫైట్‌ను తయారు చేసే కర్మాగారాలు లేవు. వాటిని ఏర్పాటు చేసుకుంటే గ్రాఫైట్ తయారు చేసుకోవచ్చు. దేశంలో ఉన్న టైటానియం మన అవసరాలకు సరిపోతుందో లేదో ఇంకా అంచనా వేయలేదు. లిథియం, కోబాల్ట్ మన దేశంలో లేవు. ఈ రెండింటినీ పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిందే. దేశంలో లభించే ఖనిజం ఉత్పత్తి, వీటిని లిథియం అయాన్ బ్యాటరీల్లో వినియోగానికి అనుగుణంగా మార్చుకోవడంపై ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు దృష్టి పెట్టాలి. దేశంలో లభించని లోహాలను ఏ రూపంలో దిగుమతి చేసుకోవాలనే విషయంలో భిన్నవాదనలు ఉన్నాయి. ముడి ఖనిజం దిగుమతి చేసుకొని ఇక్కడ లోహాలు ఉత్పత్తి చేయాలన్న భావన ఉంది. లోహం కాన్సంట్రేట్‌ను దిగుమతి చేసుకొని మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా చౌకగా, వేగంగా అందుబాటులోకి తేవాలన్న వాదనా ఉంది. వివిధ దేశాల్లో ‘క్లీన్ ఎనర్జీ’ లోహాల మైనింగ్, ఉత్పత్తి ఉన్నా, చైనా మార్కెట్ లీడర్‌గా ఎదిగింది. ఆయా లోహాల ముడి ఖనిజం నిల్వలు చైనాలో లేకున్నా, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సమకూర్చుకొంది. ఇదే తరహాలో మనమూ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటే బ్యాటరీల్లో వినియోగించే కీలక లోహాల కొరత లేకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
బ్యాటరీ కార్లను ప్రారంభించిన ఎంపీ
సాక్షి, కృష్ణా: బ్యాటరీ కార్లు వాడటం వల్ల కాలుష్య స్థాయి తగ్గుతుందని ఎంపీ బాలశౌరి అన్నారు. సోమవారం ఆయన గన్నవరం విమానాశ్రయంలో కాలుష్య రహిత బ్యాటరీ కార్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గన్నవరం విమానాశ్రయంలో బ్యాటరీ కార్లను ప్రారంభించామన్నారు. ఇక ఈ ఎయిర్‌పోర్టు నుంచి వారానికి రెండు రోజులు దుబాయ్ సర్వీసులు నడపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎయిర్ ఇండియా అధికారులను కోరామని తెలిపారు. త్వరలోనే శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాలకు సర్వీసలు గన్నవరం విమానాశ్రయం నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాలకు వారానికి రెండు రోజులు సర్వీసులు నడపాలని జెట్ ఎయిర్వేస్, ఇండిగో సంస్థలను కోరామన్నారు. ఇక్కడి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం దృష్ట్యా ఆయా సంస్థలు సానుకూలంగా స్పందించాయన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయా దేశాలకు సర్వీసులు ప్రారంభం కానున్నాయని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదనరావు పాల్గొన్నారు. చదవండి: ఏపీలో ‘కాంకర్’ పెట్టుబడులు -
గుజరాత్ గుప్పెట్లో ‘జూ’ కార్లు
తిరుపతి సిటీ: శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలోని బ్యాటరీ కార్ల నిర్వహణను గుజరాత్ కంపెనీ చేపట్టింది. ఈ మేరకు ‘సేవ్ ఈ’ ఎలక్ట్రికల్ కంపెనీతో జూ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 12 మంది డ్రైవర్లు ఇకపై గుజరాత్ కంపెనీ నేతృత్వంలో పని చేయాలని జూ అధికారులు ఆదేశాలు జారీ చేశా రు. జూలో పనిచేసే ఓ అధికారి గుజరాత్ కంపెనీ తో చేతులు కలిపి బ్యాటరీ కార్ల ద్వారా వచ్చే ఆదాయంలో కాంట్రాక్టర్‌కు 60 శాతం, జూకు 40 శాతం చొప్పున కేటాయింపులు చేస్తూ ఒప్పందం చేసుకున్నారు. మూలనపడ్డ బ్యాటరీ వాహనాలు జూలో సందర్శకులకు సౌకర్యంగా ఉన్న బ్యాటరీ కార్లు 15 మరమ్మతులకు గురి కావడంతో ఏడాదికి పైగా మూలన పడేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన ‘సేవ్ ఈ’ కంపెనీతో 30 బ్యాటరీ వాహనాలు జూ కు తీసుకొచ్చే విధంగా గత ఏడాది జూలైలోనే ఒప్పందం చేసుకున్నారు. మొదటి విడతగా 5 బ్యాటరీ వాహనాలు తెప్పించారు. అయితే ఆ వాహనాలు తెచ్చిన కొద్ది నెలలకే మరమ్మతులకు గురయ్యాయి. కంపెనీకి చెందిన వాహనాలు నాసికరంగా ఉండటం వల్లే సందర్శకులు కూర్చుని తిరిగేటప్పుడు వాహనాలకు ఉన్న విడిభాగాలు ఊడి పడిపోతున్నా యని డ్రైవర్లు చెబుతున్నారు. గతంలో జూలో ఉన్న వాహనాలకు మరమ్మతులు చేయిస్తే బాగా నడుస్తాయని డ్రైవర్లు చెబుతున్నారు. కానీ లక్షలాది రూపాయలు విలువ చేసే వాటిని మూలన పడేసి ఎక్కడో గుజరాత్లో ఉన్న కాంట్రాక్టర్‌కు ఆదాయం సమకూర్చిపెట్టడం వెనుక మతలబు ఏంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అప్పుడు నో అని.. ఇప్పుడు ఓకే అని.. ఇక్కడ మరో విశేషమేంటంటే 7వ జూ అథారిటీ ఆఫ్ ఏపీ అధికారుల సమావేశంలో బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేయలేమని, అంత బడ్జెట్ పెట్టలేమని సేవ్ ఈ సంస్థ ప్రతినిధులు జూ అధికారులకు స్పష్టంగా చెప్పేశారు. జూ అధికారులకు అవసరమైతే తమ కంపెనీ తరపున ఈఎంఐ పద్ధతిలో ఒక్కొక్క వాహనం రూ.3లక్షల 50 వేల చొప్పున 30 వాహనాలను జూకు అందిస్తామని తెలిపారు. అయితే ఈ ప్రతినిధులే 8వ జూ అథారిటీ సమావేశంలో కొత్త వాహనాలు అందించేలా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. రోడ్డున పడ్డ డ్రైవర్లు శ్రీవెంకటేశ్వర డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేసే డ్రైవర్లు ఇకపై గుజరాత్‌కు చెందిన సేవ్ ఈ కంపెనీ నుంచే జీతాలు పొందవలసి వుంటుందని జూ అధికారిణి పేర్కొన్నారు. లేకుంటే వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని సేవ్ ఈ సంస్థకు జూ అధికారులు తెలియజేశారు. దీంతో డ్రైవర్లు రోడ్డున పడ్డట్టు అయింది. ఇప్పటికే జీతాల పెంపుపై హైకోర్టులో డ్రైవర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పు వచ్చి 14 నెలలైనా సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా వారి ఉద్యోగాలే ఊడిపోయేలా జూ అధికారులు వ్యవహరించడం దారుణం. -
బ్యాటరీ కార్లు ఢీకొని చిన్నారికి గాయాలు
-
బ్యాటరీ కార్లు ఢీకొని చిన్నారికి గాయాలు
హైదరాబాద్: సాయంత్రం వేళ సరదాగా ఆడుకోవాలని పార్కుకు వెళ్లిన ఓ చిన్నారి ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ లుంబినీ పార్కులో బుధవారం సాయంత్రం రెండు బ్యాటరీ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
షాపింగ్ పూర్తయ్యేలోగా మీ కారు రీచార్జ్!
* పెట్రోలు బంకుల తరహాలో రీ-చార్జీ స్టేషన్లు * బ్యాటరీ కార్ల వాడకాన్ని పెంచాలని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. బ్యాటరీ కార్ల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని భారీగా తగ్గించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పెట్రోలు బంకుల తరహాలో రీ-చార్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలోచనను బ్యాటరీ కారు ‘రెవా’ను తయారుచేసిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో పంచుకున్నారు. ‘బ్యాటరీ కారును ఒకసారి పూర్తిగా రీ-చార్జీ చేస్తే 120 కిలోమీటర్ల వరకూ వెళుతుంది. అయితే, తర్వాత రీ-చార్జీ చేయాలంటే మళ్లీ ఇంటికే వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్‌తో పాటు ముఖ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సినిమా థియేటర్లు, సెంటర్ల వద్ద రీ-చార్జ్ స్టేషన్లను నెలకొల్పితే బ్యాటరీ కార్ల వాడకం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా షాపింగ్ ముగిసేలోగా కారు రీ-చార్జీ అవుతుంది. అలాగే ఏదైనా ఆఫీసు పని అయిపోయేలోగా కారు రీ-చార్జీ అవుతుంది. ఇలాంటి సదుపాయాలవల్ల బ్యాటరీ కార్ల వాడకం పెరుగుతుందనేది ప్రభుత్వ భావన. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తనతో సమావేశమైన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. దీనిపై స్పందించిన కంపెనీ ప్రతినిధులు రీ-చార్జీ స్టేషన్లను నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇందుకోసం స్థలాలు కేటాయించాలని కోరారు. షాపింగ్ మాల్స్‌తో పాటు ముఖ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలవద్ద రీ-చార్జీ స్టేషన్లకు స్థలాన్ని కేటాయిస్తామని కేసీఆర్ హామీనిచ్చినట్టు తెలిసింది.