సాక్షి, విజయవాడ : లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారు సోమవారం స్వదేశానికి రానున్నారు. విదేశాల నుంచి ముంబైకి చేరుకుని అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. వీరందరినీ అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి గన్నవరం విమానాశ్రయంలోనే పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. దీని కొరకు హెల్ప్ డెస్క్, వైద్య బృందాలను ఇప్పటికే సిద్ధం చేశారు. కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెండు వేల మంది గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిపై పర్యవేక్షణాధికారి, జాయింట్ కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ.. వచ్చిన వారందర్నీ 14 రోజులపాటు క్వారంటైన్‌కు తరలిస్తామని తెలిపారు. (విదేశాల నుంచి వచ్చేవారి వివరాల నమోదు)
‘ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండేందుకు ఇష్టపడనివారి కోసం.. పెయిడ్ క్వారంటైన్‌లు కూడా సిద్ధం చేశాం. నాలుగు కేటగిరీలుగా రూమ్‌లను కేటాయించాం. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటల్స్‌కు తరలిస్తాం. 14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతాం. పెయిడ్ క్వారంటైన్స్ వద్ద మెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. పోలీసుల పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఉంటుంది. ఆరోగ్యసేతు యాప్‌లో అందరినీ రిజిస్టర్ చేస్తాం. విదేశాల నుంచి వచ్చినవారందరికీ ఇండియా సిమ్‌కార్డులు ఇస్తామని’ మాధవీలత వెల్లడించారు. (ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment