
సాక్షి, గన్నవరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 9.50కి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. 10 గంటలకు ఎయిర్‌పోర్టులో బయలుదేరి 10.40 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
చదవండి: నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
అక్కడి నుంచి 11.40కి లోటస్‌పాండ్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. అనంతరం మధ్యాహ్నం తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అవుతారు. రాత్రికి లోటస్‌పాండ్‌లో బస చేస్తారు. తిరిగి 24వ తేదీ మంగళవారం ఉదయం బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి 11.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.