
రాహుల్ గో బ్యాక్!
రాహుల్ వస్తున్నారన్న సమాచారంతో కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో నిరసన
విజయవాడ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏపీ పర్యటనపై టీడీపీ నిప్పులు చెరుగుతోంది. రాహుల్ వస్తున్నారన్న సమాచారంతో కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. రాహుల్ గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులతో నినదించారు. నల్లజెండాలతో స్థానిక జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
ఎయిర్‌పోర్టు సమీపంలో రాహుల్‌గాంధీ స్వాగత ఫ్లెక్సీలపై రంగునీళ్లు విసిరి ఆగ్రహం వెళ్లగక్కారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలను అడ్డుకుని ఎయిర్‌పోర్టు నుంచి రాహుల్ గుంటూరు ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూశారు.