సాక్షి, బెంగళూరు: ఒకటి రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన పార్టీ.. ఇంకోటి అధికారంలో ఉంటూ అన్యాయాలు తప్ప మరొకటి చేయని పార్టీ.. రెండిటి డీఎన్‌ఏ ఒక్కటే! అవి తల్లి కాంగ్రెస్.. పిల్ల టీడీపీలు. గతంలో చీకటి వ్యవహారంలా కొనసాగిన వారి అనుబంధం ఇవాళ బహిరంగ వేదికపై బట్టబయలైంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసిపోయారు. బుధవారం బెంగళూరులో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాహుల్-బాబులు పబ్లిక్‌గా చేయీచేయీ కలిపారు. కార్యక్రమానికి వచ్చిన నేతలంతా వరుసగా నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్నక్రమంలోనే వీరిద్దరూ పరస్పరం అభివాదాలు, కరచాలనం చేశారు. బాబు.. రాహుల్ భుజంతట్టారుకూడా. అభివాదం చేసేటప్పుడు రెండువేళ్లు(విక్టరీ సింబల్) చూపించే చంద్రబాబు ఇవాళ అనూహ్యంగా హస్తాన్ని చూపించడం గమనార్హం.
ఏదో ఒక పార్టీ అండ లేకుండా ఏనాడూ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోని ఘనుడు చంద్రబాబు నాయుడన్న సంగతి తెలిసిందే. గతంలో వామపక్షాలు, టీఆర్‌ఎస్‌లతో జతకట్టిన టీడీపీ.. గడిచిన నాలుగేళ్లూ బీజేపీతో సంసారం చేయడం, ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేక.. ఆ నెపాన్ని తోసేయడానికి వీలుగా బీజేపీకి చంద్రబాబు విడాకులు ఇవ్వడం రాష్ట్రప్రజలు గమనించిందే. వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదనుకున్న బాబు.. చివరికి తన తల్లి కాంగ్రెస్ ఒడికిచేరడం ప్రస్తుత దృశ్యం. తన 40 ఏళ్ల చరిత్రలో నిత్యం రాజకీయ వ్యభిచారం చేస్తూ పక్కవారిపై బురదచల్లడమే అలవాటుగా పెట్టుకున్నారు చంద్రబాబు.
Comments
Please login to add a commentAdd a comment