![UK NRIs reached Gannavaram Airport - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/20/airport.jpg1_.jpg.webp?itok=8gnmlY1H)
సాక్షి, విజయవాడ: యూకే నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు 156మంది ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలోనే వీరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ప్రత్యేక బస్సుల్లో వారిని స్వస్థలాలకు తరలించనున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద అధికారులు 9 బస్సులు ఏర్పాటు చేశారు. కొవిడ్-19 కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని ఏపీకి తీసుకు రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
వందే భారత్ మిషన్ 2లో భాగంగా మొత్తం 13 విమానాలు ఏపీకి రాబోతున్నాయని ఏపీ ఎన్‌ఆర్‌టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ చెప్పారు. నిన్న విశాఖ విమానాశ్రయానికి ఫిలిప్పీన్స్, అబుదాబి నుంచి ప్రవాస ఆంధ్రులు చేరుకున్నారన్నారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం సౌదీ అరేబియా జెడ్డా నుంచి 78 మంది గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని తెలిపారు. కువైట్ నుంచి రేపు, ఎల్లుండి 144 మంది గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని మేడపాటి వెంకట్ తెలిపారు. ఆమ్నెస్టీ ద్వారా కువైట్ నుంచి రెండు విమానాల ద్వారా గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని, ప్రవాస ఆంధ్రులు 14 రోజులు క్వారం టైన్ తప్పనిసరి అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment