సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన కైత సతీష్ అనే యువకుడు గుండెపోటుతో యూకేలో మృతి చెందాడు. సతీష్ ఉన్నత చదువు కోసం యూకే వెళ్లాడు. రూములో ఎవ్వరూ లేని సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తమ కుమారుని చివరి చూపుకోసం తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
ఎలాగైనా తమ కుమారుని భౌతికకాయాన్ని అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని సతీష్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కార్గో విమానాలు నడుస్తుండటంతో సతీష్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment