
అబుదాబిలో తెలుగువారు తమ సత్తా చాటుకున్నారు. అక్కడ జరిగిన ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన రాజా శ్రీనివాసరావు విజయం సాధించారు. గతంలో ఎన్నడూ తెలుగువారికి ప్రాధాన్యత లేదు. అయితే ఈ విజయంతో తెలుగు వాడికి గత మూడున్నర దశాబ్దాలుగా లేని ప్రాధాన్యత ఈ సారి దక్కడంతో తెలుగు వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాజా శ్రీనివాసరావు సెంటర్ సదరన్ రీజియన్ సెక్రటరీగా ఎన్నిక కావడంపట్ల.. పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రాజా శ్రీనివాసరావు తెలంగాణ ఉద్యమంలో కూడా యూఏఈలో ఉంటూ తన వంతు సహకారం అందించారు. సదరన్ రీజియన్ సెక్రటరీగా విజయం సాధించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన గెలుపు యూఏఈలోని ప్రతి తెలుగు వారికి అంకితమన్నారు. ఆయనకు ఈ బాధ్యతలు లభించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.