
సాక్షి, అమరావతి: నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి చేరుకున్నారు. 11 గంటలకు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని నివాసం చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment