ఆలోచింపజేసే లైఫ్‌ స్టైల్‌ | Life Style Pre Release Event | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసే లైఫ్‌ స్టైల్‌

Published Sun, Dec 29 2019 1:11 AM | Last Updated on Sun, Dec 29 2019 1:11 AM

Life Style Pre Release Event - Sakshi

రోజా, నెహ్రు

నెహ్రు విజయ్, రోజా, నిఖిల్, సంతోషి ముఖ్య తారలుగా సి.ఎల్‌. సతీష్‌ మార్క్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైఫ్‌ స్టైల్‌’. కలకొండ నర్సింహ నిర్మించిన ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నాయకుడు మందాడి జగన్నాథం ట్రైలర్‌ను విడుల చేశారు. రచయిత గోరెటి వెంకన్న పాటలు విడుదల చేయగా, సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఆడియోను విడుదల చేశారు.

కలకొండ నర్సింహ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరుకు 4జి నెట్‌వర్క్‌కి అలవాటుపడి చదువులు, ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులను కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాలను మా చిత్రంలో సందేశాత్మకంగా చూపించాం’’ అన్నారు. సి.ఎల్‌.సతీష్‌ మార్క్‌ మాట్లాడుతూ– ‘‘అందర్నీ ఆలోచింపజేసే సినిమా ఇది. ప్రస్తుత సమస్యలు, నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఉన్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్‌ .జె
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement