సంతోషికి రజతం అవకాశం! | santhoshi silver chance! | Sakshi
Sakshi News home page

సంతోషికి రజతం అవకాశం!

Published Wed, Jul 30 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

సంతోషికి రజతం అవకాశం!

సంతోషికి రజతం అవకాశం!

 గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం గెలిచిన తెలుగు తేజం మత్స సంతోషి (53 కేజీలు)కి రజత పతకం దక్కే అవకాశాలున్నాయి. స్వర్ణం సాధించిన నైజీరియన్ లిఫ్టర్ చికా అమలాహా డోపింగ్‌లో విఫలం కావడం ఏపీ అమ్మాయికి కలిసిరానుంది. అలాగే  ఈ విభాగంలో భారత్ పతకాల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. నాలుగో స్థానంలో నిలిచిన స్వాతి సింగ్‌కు కాంస్యం లభించొచ్చు.
 
 పోటీల సందర్భంగా అమలాహా ఇచ్చిన ఎ-శాంపిల్ పాజిటివ్‌గా తేలింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షలో నిర్ధారణ కావడంతో ఆమెను గేమ్స్ నుంచి సస్పెండ్ చేశారు. అయితే బి-శాంపిల్‌లో కూడా పాజిటివ్‌గా తేలితే అమలాహా నుంచి పతకాన్ని వెనక్కి తీసుకుంటామని గేమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైక్ హూపర్ తెలిపారు.
 
 రూ. 5 లక్షల నజరానా
 మత్స సంతోషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలు నజరానా ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement