విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గరికిపేటలో శని వారం చోటుచేసుకుంది.
గరికిపేట (నెల్లిమర్ల రూరల్): విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గరికిపేటలో శని వారం చోటుచేసుకుంది. గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పతివాడ లక్ష్మి (35) పచ్చగడ్డి కోసేందుకు సమీపంలో గల వ్యవసాయ భూమిలోకి వెళ్లిం ది. అరుుతే సంబంధిత భూ యజమాని వెలుతురు కోసం పొలానికి విద్యుత్ బల్బు ఏర్పాటు చేసుకున్నాడు.
ఇటీవల వచ్చిన ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ విషయం గమనించని లక్ష్మి గడ్డికోస్తూ పొరపాటున కిందనున్న వైరును తాకింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందిం ది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉపేంద్ర సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.