అయ్యో పాపం.. కుక్కలు, పందులకు బలైన చిన్నారి..!! | Died Baby Girl Dead Body Found in Nellimarla Vizianagaram | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 19 2019 7:32 AM | Last Updated on Sat, Jan 19 2019 8:16 AM

Died Baby Girl Dead Body Found in Nellimarla Vizianagaram - Sakshi

విజయనగరం, నెల్లిమర్ల : ఏ తల్లి కన్నబిడ్డో... నడిరోడ్డుపై కుక్కలు, పందులకు ఆహారంగా మారిపోయింది. ఆడపిల్లని భారంగా భావించారో... పరువు పేరుతో నిర్దాక్షిణ్యంగా విసిరేశారో... నెల్లిమర్ల యాతవీధిలో ఓ పసికందు విగతజీవిగా పడి ఉంది. ఓ వైపు దట్టంగా కురుస్తున్న మంచు... మరోవైపు చలిగాలులకు కన్ను కూడా తెరవని ఆ చిన్నారి ఏడుపు సమీప కుటుంబాల చెవిన శుక్రవారం వేకువఝామున పడింది. తలుపుతెరుచుకుని వచ్చి చూస్తే ఆ శిశువును చీల్చేస్తున్న పందులు కనిపించాయి.

వెంటనే ఆ పందులను తరిమి చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రాణాలు వదిలిన ఆ చిన్నారిని వారే శ్మశానంలో పూడ్చిపెట్టారు. నెల్లిమర్ల పట్టణంలోని శ్రీనివాసా థియేటర్‌ ఎదురుగా యాతవీధిలో ఖాళీగా నున్న ప్రదేశంలో ఆ పసికందును ఎవరో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు విసిరేసినట్టు తాను చూశానని ఓ బాలుడు చెబుతున్నాడు. కనీసం బొడ్డు కూడా కోయకుండా తీవ్రమైన చలిలో పడేశారు. అక్కడే సంచరిస్తున్న పందులు, కుక్కలు చిన్నారిని చీల్చుకు తిన్నాయి. సంఘటన చూసిన స్థానికులు చలించిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement