నెల్లిమర్లలో నాలుగు పూరిళ్లు దగ్ధం | Fire accident in nellimarla vizianagaram District | Sakshi
Sakshi News home page

నెల్లిమర్లలో నాలుగు పూరిళ్లు దగ్ధం

Published Wed, Dec 9 2015 11:37 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in nellimarla vizianagaram District

విజయనగరం : ప్రమాదవశాత్తు నిప్పంటుకుని నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఆత్మారామం అగ్రహారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇంట్లోని వారంతా నిద్రిస్తున్న సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో నిద్రిస్తున్న వారంతా బయటకు పరుగులు తీశారు.

మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న మరో పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు వెల్లడించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement