విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్‌వోబీ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
నెల్లిమర్ల, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్‌వోబీ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయనగరం పట్టణం కొత్తగ్రహారంలో ఉంటున్న ఎస్.బాలాజీసింగ్(40), భార్య అనుపమ, కుమారులు పురుషోత్తం(8), అనీష్(4)లతో కలసి ఆదివారం నెల్లిమర్ల చంపావతి నది వద్దకు విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నెల్లిమర్ల ఆర్‌వోబీ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన తండ్రి, ఇద్దరు కుమారులూ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు రావడంతో మరో ట్రాక్‌పైకి వెళ్లారు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వచ్చిన ప్యాసింజర్ రైలు వారిని ఢీకొంది. ఈ దుర్ఘటనలో తండ్రీ, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు.