three dies
-
నివురుగప్పిన నిర్లక్ష్యం.. ముగ్గురు చిన్నారుల బలి
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం ముగ్గురు చిన్నారులను బలితీసుకుంది. ఇళ్ల సమీపంలోగల నీటి గుంతల వద్దకు బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ఒకరిని రక్షించబోయి మరొకరు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులు నివర్ద్ కాంబ్లీ, కృష్ణ, సందీప్ సుభాష్‌ల కుటుంబాలు మహారాష్ట్ర నుంచి 10 ఏళ్ల కిందట హనుమాన్‌నగర్ కాలనీకి వలసవచ్చాయి. రోజూ కూలీ చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న తమ కుటుంబాల్లో అక్రమ మట్టి తవ్వకాలు చిచ్చురేపాయని చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మట్టిని తవ్వుకున్న అనంతరం గుంతల్ని పూడ్చకుండా వదిలివేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. -
అతిసార.. మేల్కోరా!
జిల్లాలో విజృంభిస్తున్న - నెల రోజుల్లో ముగ్గురు మృతి - అనంతపురంలోనే ఇద్దరు మృత్యువాత - వందల సంఖ్యలో బాధితులు - పీహెచ్సీలో అందని వైద్య సేవలు - మరణాలే లేవంటున్న అధికారులు - ముందస్తు చర్యలు శూన్యం అతిసార వ్యాధి విజృంభిస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దోమల వ్యాప్తితో పాటు ఈగల బెడద కారణంగా వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి. కనీసం అవగాహన శిబిరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అనంతపురం మెడికల్: జిల్లాలో పల్లెలు.. పట్టణాలు తేడా లేకుండా వ్యాధుల తీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జబ్బుతో మంచం పడుతున్నారు. విష జ్వరాలకు తోడు అతిసార వ్యాధి తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. అనంతపురం సర్వజనాసుపత్రిలోని ఐడీ వార్డులో ఈనెల 5న నగరానికి చెందిన సరోజమ్మ(50) మృతి చెందగా.. గత నెల 8న మిస్సమ్మ కాలనీకి చెందిన శ్రీరాములు, బెళుగుప్ప మండలం ఆవులెన్న గ్రామస్తురాలు హుసేనమ్మ మృత్యువొడి చేరారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్నా వైద్య ఆరోగ్య శాఖ మేల్కోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా కాకి లెక్కలతో కాలం వెల్లదీస్తోంది. అతిసార మరణాలను ఇతరత్రా వ్యాధులతో మరణించినట్లుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలను పక్కనపెడితే జిల్లా కేంద్రంలోనూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలో ఎటు చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తున్నా ప్రజా ప్రతినిధులు మేల్కొంటున్నట్లు దాఖలాల్లేవు. పీహెచ్‌సీల్లో అందని వైద్యం అతిసార సోకగానే బాధితులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం.. రోగి పరిస్థితి ఆందోళనకరంగా లేనప్పటికీ ‘మనకెందుకొచ్చిందిలే’ అని వైద్యులు సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. కొందరు ప్రాణభయంతో ప్రైవైట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వైద్యులు వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. అతిసార లక్షణాలు వాంతులు, విరేచనాలు(బేదులు), కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం. అతిసార కారణాలు కలుషితమైన నీరు తాగడంతో పాటు, ఆహార పదార్థాలు తినడం వల్ల అతిసార సోకుతుంది. నిలువ ఉన్న ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. మంచి నీరు సరఫరా చేసే పైపులు పగిలిపోయి అందులో కలుషిత నీరు కలవడం వల్ల ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. పరిసర, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం కూడా ఓ కారణమే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : క్లోరిన్ కలిపిన నీరు సరఫరా అవుతుందా? లేదా? పరిశీలించాలి. గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో సరిగ్గా బ్లీచింగ్ అవుతోందా తెలుసుకోవాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పగిలిన పైపులను మరమ్మతు చేయించుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లను నిలువ ఉంచుకోవాలి. ఇంట్లో నీటిని కాచి.. చల్లార్చి తాగే అలవాటు చేసుకోవాలి. పరిశుభ్రమైన నీరు తాగాలి అతిసార ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. వంట చేసే ముందు.. భోజనం వడ్డించే సమయంలో.. భోజనం చేసే ముందు.. మల విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ఈగలు వాలకుండా వంట పాత్రలపై మూతపెట్టాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. ప్రధానంగా మురికినీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. పరిసరాల్లో చెత్తకుప్పలు ఉండకుండా చూసుకోవాలి. – డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, చిన్నపిల్లల వైద్యుడు, సర్వజనాస్పత్రి చర్యలు తీసుకుంటాం వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అతిసారపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తాం. అతిసారతో అధికారికంగా ఒక్కరూ చనిపోలేదు. ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో బాధితులుంటే సీరియస్‌గా పరిగణిస్తాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ -
పెళ్లికొస్తూ.. పై లోకాలకు..
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం ముగ్గురి దుర్మరణం - మరో పది మందికి గాయాలు - మృతుల్లో అమడగూరు మండల యువకుడు వంశోద్ధారకుడి కోసం ఆ దంపతులు ఎన్నో నోములు నోచారు. వారి నోముల ఫలితంగా వరుసగా నలుగురు ఆడబిడ్డల తరువాత పుట్టిన బిడ్డ అతను. అందరి ఆశలు అతని మీదే. పూలమ్మి మంచి చదువు చదివించారు. ఇప్పుడిప్పుడే ఓ ఉద్యోగం సాధించి, జీవితంలో నిలదొక్కుకుంటున్న తరుణంలో విధికి కన్నుకుట్టిందేమో.. తెల్లారితే దాయాదుల ఇంట్లో జరిగే పెళ్లికి బైక్‌లో బయలుదేరిన ఆ యువకుడ్ని మార్గమధ్యంలోనే మృత్యువు రోడ్డు ప్రమాదరూపంలో కబళించి, కాటికి పంపింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. - అమడగూరు(పుట్టపర్తి) అమడగూరు మండలం చీకిరేవులపల్లికి చెందిన రెడ్డమ్మ, రమణారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు శివశంకర్‌రెడ్డి(25) కర్ణాటక రాష్ట్రం బెంగళూరు-హొసకోట సమీపంలోని శెట్టిపల్లి క్రాస్‌లో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో కర్ణాటక వాసులు మరో ఇద్దరు మరణించగా, ఇంకో పది మంది గాయాపడ్డారని పోలీసులు, మృతుని బంధువులు తెలిపారు. ఎలా జరిగిందంటే.. బీఫార్మసీ చేసిన శివశంకర్‌రెడ్డికి బెంగళూరులో ఇటీవలే ఉద్యోగం వచ్చింది. తమ స్వగ్రామంలోని దాయాదుల ఇంట్లో ఆదివారం ఉదయమే జరగనున్న పెళ్లికి అతను శనివారం రాత్రే బైక్‌లో బయలుదేరాడు. మార్గమధ్యంలో శెట్టిపల్లి క్రాస్‌లోకి రాగానే.. చింతామణి నుంచి బయలుదేరిన మినీ బస్సు ముందుగా వెళ్తున్న కారును ఓవర్‌టెక్ చేయబోయింది. ఈ క్రమంలో అదుపు తప్పి కారును బలంగా ఢీకొనడంతో మినీబస్సు మూడు పల్టీలు కొట్టి, ఎడమ వైపు నుంచి కుడి వైపునకు రోడ్డుకడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో కర్ణాటక వాసులు ఇద్దరు మృతి చెందగా, మరో పది మంది గాయపడి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన శివశంకర్‌రెడ్డి బైక్ మినీ బస్సును ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించారు. పువ్వుల్లో పెట్టి చూసుకున్నా... పూట గడవడమే కష్టమైనా కుటుంబంలో పుట్టినా.. కసి, క్రమశిక్షణ, పట్టుదలతో బీఫార్మసీ పూర్తి చేసి ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో స్థిరపడుతున్న కుమారుడ్ని చూసి వృద్ధ తల్లిదండ్రులు, ఆడబిడ్డలు, బంధువులు అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చెట్టంత కుమారుడు విగతజీవిగా మారడంతో వారు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగానే వారు కుప్పకూలిపోయారు. ఇక మేం ఎవరికోసం బతకాలి కొడకా.. ముసలోళ్లమైన మాకు అండగా ఉంటావనుకుంటిమే. ఇక మాకు దిక్కెవరు తండ్రీ’ అంటూ కుమారుడి మృతదేహంపై పడి తల్లిదండ్రులు హృదయ విదారకంగా విలపించిన తీరు అందరి హృదయాలను బరువెక్కించింది. పుట్టపర్తి మండలంలో మరొకరు.. పుట్టపర్తి అర్బన్ : గోరంట్ల-కొత్తచెరువు మార్గంలోని పుట్టపర్తి మండలం జగరాజుపల్లి సమీపంలో గల మంగళకర కళాశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన లక్ష్మానాయక్(55) అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు.. ఉదయం 8 గంటలకు గోరంట్ల నుంచి ఎనుములపల్లికి బయలుదేరిన నరసింహమూర్తి ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలోని మంగళకర కళాశాల వద్దకు రాగానే ఐచర్ వాహనం ఓవర్‌టెక్ చేసే ప్రయత్నంలో ఆటోను ఢీకొంది. ఆటోను 20 మీటర్ల దూరం ఐచర్ వాహనం ఈడ్చుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న కల్లితండాకు చెందిన లక్ష్మానాయక్ మరణించగా, పుట్టగుండ్లపల్లికి చెందిన వెంకటమ్మ, ఓబుళమ్మ, గువ్వలగుట్టపల్లికి చెందిన గంగమ్మ మరో మహిళ, జగరాజుపల్లికి చెందిన గౌతమి అనే విద్యార్థిని, ఆటో డ్రైవర్ నరసింహమూర్తి, గుమ్మయ్యగారిపల్లికి చెందిన అంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వచ్చిన ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. వారిని వెంటనే పుట్టపర్తి సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా లక్ష్మానాయక్ బ్రాహ్మణపల్లి తండాలో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై పడి భార్య సాలీబాయి న్నీరుమున్నీరయ్యారు. వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు నిర్లక్ష్యంగా నడపడగమే గాక.. ఒకరి మృతికి కారణమైన ఐచర్ వాహనాన్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్‌ను గ్రామస్తులు వెంబడించారు. చివరకు కప్పలబండ వద్ద పట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనే కొత్తచెరువు ఎస్ఐ రాజశేఖరరెడ్డి, పుట్టపర్తి రూరల్ ఏఎస్ఐ ప్రసాద్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. -
రాకాసి రహదారులు
- వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు ముగ్గురి దుర్మరణం - దైవదర్శనానికి వెళ్లొస్తూ ఇద్దరు ‘అనంత’ విద్యార్థులు.. - బైక్‌పై బయలుదేరిన కాసేపటికే వ్యాపారి.. రాకాసి రహదారులు ప్రజల రక్తం తాగుతున్నాయి. అయిన వారి కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్నాయి. నిర్లక్ష్యం.. అజాగ్రత్త..అలసత్వం.. ఏదైనా సరే.. నిండు జీవితాలు అర్ధాంతరంగా బలైపోతున్నాయి. తాజాగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు దైవదర్శనానికి వెళ్లొస్తూ ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే మృత్యుబారినపడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటనలతో ఆయా ప్రాంతాల్లో తీరని విషాదం నెలకొంది. కూడేరు(ఉరవకొండ) : కూడేరు మండలం శివరాంపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం రుద్రంపేటకు చెందిన పుల్లప్ప కుమారుడు కుమార్(13), రామాంజనేయులు కుమారుడు ముఖేష్(14) మరణించారు. ఎస్ఐ రాజు తెలిపిన మేరకు... కుమార్, ముఖేష్ సహా మరో ముగ్గురు కలసి ఆటోలో పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆటోలో వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం వారంతా అదే ఆటోలో తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న ఆటో శివరాంపేట వద్దకు రాగానే అనంతపురం నుంచి ఉరవకొండకు బయలుదేరిన లారీ విపరీతమైన వేగంతో వచ్చి, బలంగా ఢీకొనడంతో కుమార్ తలభాగం పూర్తిగా తెగిపోగా, మొండెం మాత్రం మిగిలింది. తీవ్రంగా గాయపడిన ముఖేష్‌ను అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుమార్ 8వ తరగతి, ముఖేష్ 9వ తరగతి చదువుతున్నారు. పుల్లప్పకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కాగా, ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహంపై పడి రోదించిన తీరు అందరి హృదయాలను బరువెక్కించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. -
రహదారులపై ఆరని రక్తపు తడి
- వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం - తెగిన తాతా, మనవరాలు అనుబంధం - పెళ్లికి వెళ్లొస్తుండగా ఘటన రహదారుల రక్తపు దాహం తీరేలా లేదు. బుధవారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడగా, వారిలో దంపతులూ ఉన్న సంగతి తెలిసిందే. వాటికి కొనసాగింపుగా గురువారం మళ్లీ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముగ్గుర్ని కబళించాయి. వారిలో తాతా, మనవరాలు ఉండడం విషాదం. పెళ్లికి వెళ్లొస్తుండగా ఈ ఘటన జరిగింది. గార్లదిన్నె(శింగనమల) : హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిలోని గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంతకల్లు తిలక్‌నగర్‌కు చెందిన గోపాలకృష్ణ(67), ఆయన మనవరాలు అవంతిక(17) దుర్మరణం చెందారు. జ్యుడిషియల్ కోర్టులో సూపరింటెండెంట్‌గా పని చేసి రిటైర్డ్ అయిన గోపాలకృష్ణ ధర్మవరంలో జరిగిన తన సోదరుడి కుమారుడి పెళ్లికి కుటుంబంలో కలసి హాజరయ్యారు. ఆ తరువాత వారు హిందూపురం వెళ్లాల్సి ఉంది. అయితే కుటుంబ సభ్యులందరినీ అక్కడే వదిలి మనవరాలితో కలసి ఆయన గుంతకల్లుకు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కల్లూరు సమీపంలోని ఈసర్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే రోడ్డుకడ్డంగా కుక్క రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. కారు మొత్తం నుజ్జునుజ్జైంది. ఘటనలో కారులో ఉన్న గోపాలకృష్ణ అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన అవంతికను 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే కుటంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పెళ్లిలో గడిపన ఆనంద క్షణాలు గుర్తుచేసుకొని బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తెల్లారిన బతుకులు
వారంతా కళాకారులు...ఊరూరూ తిరుగుతూ భజనలు చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. ఎన్పీకుంట మండలం గొల్లపల్లిలో జరిగిన ఓ వర్ధంతి కార్యక్రమంలో భజన చేసేందుకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు మృత్యువాత పడగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం – లారీ, ఆటో ఢీ - ముగ్గురి దుర్మరణం – మరో పది మందికి తీవ్ర గాయాలు – మృతులు, క్షతగాత్రులు చిత్తూరు జిల్లా వాసులు కదిరి టౌన్ \ తనకల్లు : వర్ధంతి కార్యక్రమం కోసం వచ్చిన భజన బృందం తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. తెల్లారేసరికల్లా ఇంటికి చేరుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. మార్గమధ్యంలోనే లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. బృందంలోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో పది మంది గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. చిత్తూరు జిల్లా పీటీఎం మండలం శ్రీనివాసరాయునిపల్లెకు చెందిన భజన కళాకారుల బృందం అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం పెడపల్లి సమీపంలో గల గొల్లపల్లిలో గల సమీప బంధువు వర్ధంతికి నరసింహులు అనే వ్యక్తికి చెందిన ఆటోలో గురువారం రాత్రి వచ్చారు. రాత్రి భజన అయిపోయాక తెల్లవారుజామున 3 గంటలకు అదే ఆటోలో స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలోని తనకల్లు మండలం చీకటిమానిపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా ఢీకొంది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణమూర్తి(45) అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల సాయంతో మిగిలిన క్షతగాత్రులను వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ(66) మరణించాడు. పరిస్థితి విషమంగా ఉన్న రత్నమ్మ(60)ను మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఆటో డ్రైవర్ నరసింహులు, శంకరప్ప, పార్వతమ్మ, లక్ష్మీదేవమ్మ, రెడ్డెమ్మ, నారాయణమ్మ, రాయప్ప, ఈశ్వరప్ప, లావణ్య, వెంకటరమణ గాయపడ్డారు. వారిలో నారాయణమ్మ, రెడ్డెమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతికి తరలించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కాగా, ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరంతా పొట్ట కూటి కోసం భజనలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వారు. మృతుల్లో కృష్ణమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటరమణకు కూడా భార్య లక్ష్మీదేవి, ఇద్దరు సంతానం. రెడ్డెమ్మకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ మేరకు తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రెండు లారీలు ఢీ.. ముగ్గురు మృతి
సత్తుపల్లి(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మెడిశేట్టివారిపాలెం క్రాస్ రోడ్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి కాకినాడకు గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ అశ్వరావుపేట నుంచి సత్తుపల్లి వైపు బియ్యం లోడ్‌తో వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్‌జిల్లాకు చెందిన ఇద్దరితో పాటు మరో వ్యక్తి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పడవ బోల్తా...ముగ్గురి జలసమాధి
ముంబై: జలాశయంలో పడవపై సరదాగా చేసుకున్న మద్యం పార్టీ ముగ్గురిని బలితీసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై నగరానికి నీటిని సరఫరాచేసే పొవయి జలాశయంలో పడవ బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా ఐదుగురిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ఘాట్కోవర్, పొవయి, కల్యాణ్ పన్వేల్ ప్రాంతాలకు చెందిన 8 మంది మిత్రులు పొవయి జలాశయంలో పార్టీ చేసుకోవాలని నిర్ణయించి స్టీమర్‌ను బుక్‌చేసుకున్నారు. వీరందరూ శనివారం వేకువజామున స్టీమర్లో జలాశయం మధ్యలోకి చేరుకుని మద్యం పార్టీ ప్రారంభించారు. ఇద్దరు మిత్రులు ఆలస్యంగా రావడంతో వారికోసం స్టీమర్‌ను ఒడ్డుకు తిప్పారు. ఇంతలో స్టీమర్ బోల్తాపడింది. ముగ్గురు యువకులు నీట మునిగారు. నీటిలో తేలుతున్న స్టీమర్‌ను పట్టుకుని వేలాడుతున్న ఐదుగురిని గమనించిన పోలీసులు కాపాడారు. నీటిలో మునిగిపోయిన దినేష్ భోయర్(34), రాసూల్ ఖాన్(47), అతీక్ లతీఫ్‌ఖాన్(22)ల మృతదేహాలను శనివారం రాత్రి పొద్దుపోయాక వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపారు. -
జనసందోహం మధ్య అంతిమయాత్ర
అనంతపురం సెంట్రల్ : అనంతపురం సాయినగర్ శోకసంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన నాయకుల మృతదేహాలను చూసేందుకు అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కడసారి చూసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. కర్నూలు జిల్లా డోన్ శివార్లలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ యడగూరి రామ్మోహన్‌రెడ్డి, ఆయన భార్య మాధవి, కూమార్తె అనూష మృతి చెందిన విషయం విదితమే. శుక్రవారం సాయంత్రమే పార్థివదేహాలను సాయినగర్ మూడో క్రాస్‌లోని వారి నివాసానికి తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం శనివారం మధ్యాహ్నం వరకూ ఉంచారు. వేలాది మంది అభిమానులు, నేతలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి అంజలి ఘటించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సైతం అనంతపురం చేరుకుని మరణించిన వారి పార్థివదేహాలకు నివాళులర్పించారు. రామ్మోహన్‌రెడ్డి కుమారుడు అనుదీప్రెడ్డిని ఓదార్చారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి ఽగంటకు అంతిమయాత్ర ప్రారంభించారు. సాయినగర్ నుంచి గుత్తి రోడ్డు మీదుగా సోములదొడ్డి, పామురాయి, వడియంపేట, రేగడికొత్తూరు వరకు అంతిమయాత్ర కొనసాగింది. దారి పొడువును వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు సమీపంలోని వారి తోటలో అంత్యక్రియలు పూర్తి చేశారు. తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు అనంత రాజకీయ చరిత్రలో బలపనూరు పుల్లారెడ్డి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయాలకతీతంగా అభిమానులు ఉన్నారు. దీంతో మాజీ కౌన్సిలర్, నీటి సంఘం అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ మాధవి, కుమార్తె అనూష అంతిమయాత్రలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర సమాచారం శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకర్‌చౌదరి, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, మాజీ ఎంపీ, వైఎస్సాసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఆలూరు సాంబశివారెడ్డి, పేరం నాగిరెడ్డి, తోపుదుర్తి కవితా భాస్కర్‌రెడ్డి, ఎల్ఎం మోహన్‌రెడ్డి, లింగాల చంద్రశేఖర్‌రెడ్డి, పెన్నోబిలేసు తదితరులు హాజరైన వారిలో ఉన్నారు. రామ్మోహన్‌రెడ్డి మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయాలకతీతంగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి అని కొనియాడారు. -
నూజివీడులో విషాదం.. ముగ్గురి మృతి
నూజివీడు(కృష్ణాజిల్లా): కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మత పరమైన కార్యక్రమంలో భాగంగా.. జెండాలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఎం.ఆర్ అప్పారావు కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మహ్మద్ ప్రవక్త(సఅసం) పుట్టిన రోజు(మిలాదున్ నబి) సందర్భంగా ఎం. ఆర్ అప్పారావు కాలనీలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాలనీని విద్యుద్దీపాలు, జెండాలతో అలంకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాలనీకి చెందిన షేక్ తన్వీర్, షేక్ ఇస్మాయిల్, షేక్ కాలేషాలు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
కారు, లారీ ఢీ : ముగ్గురు మృతి
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కొండాపురం(మెదక్ జిల్లా): కొండాపురం మండలం మల్కాపురం వద్ద బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో కారు, లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా హైదరాబాద్‌లోని రామచంద్రాపురంలో ఉన్న శ్రీనివాస్ నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా కారులో హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్తుండగా జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రక్తదారులు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. గోరంట్ల మండలం రెడ్డిచెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పూలచెట్లపల్లికి చెందిన విశ్వనాథ్‌రెడ్డి (12), బూదిలి గ్రామ సమీపంలోని పుట్టపర్తి– బెంగుళూరు ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో చిలమత్తూరు మండలం సోమఘట్టకు చెందిన లక్ష్మమ్మ (65) మృతి చెందారు. రాయదుర్గం మండలం మల్లాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన ప్రసాద్(40) దుర్మర ణం చెందాడు. గోరంట్ల : మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. మండలంలోని పూలచెట్లపల్లికి చెందిన నరేంద్రరెడ్డి, ఇందిరమ్మ కుమారులిద్దరూ విశ్వనాథ్‌రెడ్డి (12), విజయ్‌కుమార్‌రెడ్డి (13) పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8 వతరగతి చదువుతున్నారు. శనివారం వారని పాఠశాలకు పంపించేందుకు నరేంద్రరెడ్డి ఇద్దరినీ గ్రామ బస్టాప్ వద్ద దింపి వెళ్లారు. అదే సమయానికి పట్టణంలోని ఓ ఫొటో స్టూడియోలో పని చేసే యువకుడు పవన్ వీరిద్దరినీ ద్విచక్రSవాహనంపై ఎక్కించుకొని పాఠశాలకు వెళ్తుండగా రెడ్డిచెర్వు కట్ట సమీపంలో గోరంట్ల నుంచి కదిరి వైపు వేగంగా వస్తున్న టాటా సుమో ద్విచక్రSవాహనాన్ని ఢీకొనింది. ఈ ప్రమాదంలో మధ్యలో కూర్చున్న విశ్వనాథ్‌రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. విజయకుమార్‌రెడ్డికి కాలు విరిగింది. పవన్‌కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు టాటా సుమోలో గోరంట్ల ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో విశ్వనాథ్‌రెడ్డి మృతి చెందాడు. విజయ్‌కుమార్‌రెడ్డిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. మండలంలోని బూదిలి గ్రామసమీపంలోని పుట్టపర్తి– బెంగుళూరు ప్రధాన రహదారిలో చిలమత్తూరు మండలం సోమఘట్టకు చెందిన లక్ష్మమ్మ(65) అనే వృద్ధురాలిని కారు ఢీకొనింది. గాయపడిన ఆమెను హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మల్లాపురం సమీపంలో ఒకరు రాయదుర్గం : మండలంలోని మల్లాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి శనివారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు .... బళ్లారికి చెందిన ప్రసాద్æ(40), రాము అనే వ్యక్తులు శ్రావణ శనివారం సందర్భంగా రాయదుర్గం మండలంలోని మల్లాపురం విప్రమలై నవ నరసింహస్వామి దర్శనానికి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మల్లాపురం గ్రామ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా, రాము స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. బళ్లారిలో చికిత్స పొందుతూ ప్రసాద్ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చే స్తున్నారు. -
ఆటో-వ్యాన్ ఢీ: ముగ్గురు మృతి
ముదోల్(ఆదిలాబాద్): ఆటో, వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మండలం తక్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఒకరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు నిజామాబాద్‌కు చెందిన మునీర్, అబ్బాస్, ఆవేశ్గా గుర్తించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఏలూరు: వేగంగా వెళ్తున్న వాహనం రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. నల్లగొండ జిల్లా నుంచి కైకరం వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం గ్రామ శివారుకు చేరుకోగానే.. రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఢీకొట్టింది. టాటా ఏస్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. -
కారు, టిప్పర్ ఢీ: ముగ్గురు మృతి
రంగారెడ్డి: హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్ పెట్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పై కారు, టిప్పర్ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
ఆదిలాబాద్: వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వినాయక నిమజ్జనానికి వెళుతున్న సమూహానికి కరెంట్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామంలో చోటుచేసుకుంది. కరెంట్ షాక్ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో తీవ్రగాయాలైన మరోవ్యక్తికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి
కర్నూలు: బేతంచర్ల మండలం గోరుమాన్కొండకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గ్రామ సమీపంలోని మైనింగ్ గుంటల్లో ఈతకొట్టడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిషోర్(20), సురేందర్(16), సాయిసుబ్రహ్మణ్యం(16) అనే ముగ్గురు యువకులు మరణించారు. గ్రామస్తులు గుంట నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆదివారం సాయంత్రం వేర్వేరు చోట్ల పిడుగుపడి ముగ్గురు మృతిచెందారు. వేములకోట గ్రామంలో బోరు వేస్తుండగా పిడిగుపడి బీహార్‌కు చెందిన సతీష్(24) అక్కడికక్కడే మృతిచెందాడు. తుర్లపాడు మండలం గానుగపెంట గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గూడూరు క్యాంపు తండాకు చెందిన ముగ్గురు యువకులు గోదావరి పుష్కరాల కోసం ఒకే బైక్‌పై భద్రాచలం వెళుతుండగా..తుఫాను వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. వారిలో బాలావత్ సైదులు, రామావత్ వెంకటేష్ ఉన్నారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుంటూరులో రోడ్డు ప్రమాదం
-
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
గుంటూరు: ఆటోను లారీ ఢీకొన్న సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతల పూడి గ్రామ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వల్లభాపురానికి చెందిన ఆటో తెనాలి నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. -
బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు సమీపంలో ఓ బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయ్యవారి నార్లాపురం గ్రామానికి చెందిన సురేంద్రారెడ్డి, బూసిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఒకే బైక్‌పై వెళుతుండగా పెద్దపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రైలు ఢీకొని ముగ్గురి మృతి
నెల్లిమర్ల, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్వోబీ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయనగరం పట్టణం కొత్తగ్రహారంలో ఉంటున్న ఎస్.బాలాజీసింగ్(40), భార్య అనుపమ, కుమారులు పురుషోత్తం(8), అనీష్(4)లతో కలసి ఆదివారం నెల్లిమర్ల చంపావతి నది వద్దకు విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నెల్లిమర్ల ఆర్వోబీ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన తండ్రి, ఇద్దరు కుమారులూ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు రావడంతో మరో ట్రాక్‌పైకి వెళ్లారు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వచ్చిన ప్యాసింజర్ రైలు వారిని ఢీకొంది. ఈ దుర్ఘటనలో తండ్రీ, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. -
గోడ కూలి ఇద్దరు మహిళల సహా ఓ చిన్నారి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ వర్షాలు ముగ్గురిని బలిగొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందారు. మసబ్ ట్యాంక్ విజయనగరం కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు ఇప్పటి వరకూ రెండు మృతదేహాలను వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్ గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను వెలికి తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా రెండు నెలల క్రితం మౌలాలీలోని అల్వాల్ లో కూడా భవనం ప్రహరీ గోడ కూలి పక్కనే నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
గో్డ కూలి ఇద్దరు మహిళల సహా ఓ చిన్నారి మృతి