మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆదివారం సాయంత్రం వేర్వేరు చోట్ల పిడుగుపడి ముగ్గురు మృతిచెందారు.
వేములకోట గ్రామంలో బోరు వేస్తుండగా పిడిగుపడి బీహార్‌కు చెందిన సతీష్(24) అక్కడికక్కడే మృతిచెందాడు. తుర్లపాడు మండలం గానుగపెంట గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.