గుంటూరు: ఆటోను లారీ ఢీకొన్న సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతల పూడి గ్రామ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
వల్లభాపురానికి చెందిన ఆటో తెనాలి నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.